Moviesలాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చిన చలాకీ చంటీ..కొంప ముంచేశాడురోయ్..!?

లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చిన చలాకీ చంటీ..కొంప ముంచేశాడురోయ్..!?

జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఎంతోమంది కమెడియన్స్ కు లైఫ్ ఇచ్చిన షో. అయితే ప్రజెంట్ ఈ షో చర్చనీయాంశంగా మారింది. జబర్దస్త్ షో చాలా ఫ్రాడ్ జరుగుతుంది అంటూ ఎక్స్న్ కంటెస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనకు తెలిసిందే ఇప్పటికే జబర్దస్త్ షో నుంచి చాలామంది ఓల్డ్ కమెడియన్స్ వెళ్లిపోయారు. షోలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని ..మల్లెమాల సరైన రీతిలో ఆన్సర్ ఇవ్వట్లేదని.. షో హెడ్ ఏడుకొండలు అందరిని రెమ్యూనరేషన్ పేరుతో మోసం చేస్తున్నారని.. గొడ్డు చాకిరి చేయించుకుంటూ రెమ్యూనరేషన్ ఇవ్వట్లేదు అని ..పంచులు పేలడం లేదు అని రెమ్యూనరేషన్ లో కోతలు విధిస్తున్నారని పలువురు కమెడియన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఆ రీజన్ తోనే చాలామంది జబర్దస్త్ కమెడియన్స్ షో వదిలి వేరే షోస్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తున్నారు జబర్దస్త్ షో వాళ్ళు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జబర్దస్త్ స్టార్ కమెడియన్ చలాకి చంటి షో నుంచి తప్పకుండా తెలుస్తుంది. దీనికి కారణాలు లేకపోను లేదు జబర్దస్త్ షో ద్వారా చాలామంది పాపులర్ అయ్యి వేరే షో కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. జబర్దస్త్ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో మిగతా ఛానల్ కు వెళ్లి అవకాశాలు కొట్టేసిన వాళ్ళు బోలెడూ మంది ఉన్నారు.

ఈ క్రమంలోనే చలాకీ చంటి కు మాటీవీలో వచ్చే బిగ్ బాస్ షోలో ఆఫర్ వచ్చినట్లు వార్తలు వైరలొ అవుతున్నాయి. మరి కొద్ది రోజుల్లో స్టార్ట్ కానున్న బిగ్ బాస్ లో జబర్దస్త్ కమెడియన్ చలాకి చంటికి అనూహ్యంగా అవకాశం వచ్చిన్నట్లు తెలుస్తుంది. నిజానికి ఇప్పటికే బిగ్ బాస్ లోకి వెళ్లే కంటెస్టెంట్ల లిస్ట్ రెడీ అయిపోయింది. మా టీవీ బిగ్ బాస్ యాజమాన్యం సెలెక్ట్ చేసింది. కానీ అనూహ్యంగా ఒక కంటెస్టెంట్ సిక్ అవ్వడంతో ఆయన ప్లేస్ లోకి.. చలాకి చంటిని పంపిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే సడెన్ గా చలాకి చంటి జబర్దస్త్ షో నుంచి తప్పుకున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news