Moviesఎన్టీఆర్‌పై స‌మంత మ‌న‌సు లాగేస్తోందా... ఎంత రిస్క్ చేస్తోందంటే...!

ఎన్టీఆర్‌పై స‌మంత మ‌న‌సు లాగేస్తోందా… ఎంత రిస్క్ చేస్తోందంటే…!

పెళ్లి, విడాకులు తర్వాత కూడా కెరీర్ ముందుకు తీసుకెళ్లిన స్టార్ హీరోయిన్ సమంత. విచిత్రం ఏంటంటే నాగచైతన్యతో విడాకులు తర్వాత కూడా అదే ఊపు కొనసాగించడానికి సమంత బాగా కష్టపడుతోంది. ఇప్పటికే ఆమె తెలుగులో నటించిన రెండు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు యశోద – శాకుంతలం త్వరలోనే రిలీజ్ కానున్నాయి. మరోవైపు బాలీవుడ్లో ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తీసిన బోస్ – డీకేలకు మరో ప్రాజెక్ట్ కమిట్ అయింది. అలాగే హిందీలో మరో సినిమాలో కూడా నటిస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులకు ఆమె ఇప్పటికే ఒకే చెప్పేసింది. అయితే ఇలాంటి సమయంలో ఆమెకు తెలుగులో తిరుగులేని ఆఫర్ వచ్చింది.

అదే జూనియర్ ఎన్టీఆర్ సినిమా. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో హీరోయిన్ కోసం ఇప్పటికే చాలామంది పేర్లు పరిశీలించారు. ఈ ప్రాజెక్టు ఆలస్యం కావడానికి చాలా కారణాలు ఉన్నా అందులో హీరోయిన్ దొరకపోవడం కూడా మరో కారణం. కొరటాల గత మూడు నాలుగు నెలలుగా హీరోయిన్ కోసం వెతుకులాట ప్రారంభించారు. ఆలియా భట్ పేరు వినిపించిన ఆమె గర్భవతి కావడంతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది.

ఇక సమంత తెలుగులో ఇప్పటికే విజయ్ దేవరకొండకు జోడిగా ఖుషి సినిమాలో నటిస్తోంది. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో నటించేందుకు ఆమెను సంప్రదించడంతో.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా వదులుకోకూడదని విశ్వ ప్రయత్నాలు చేస్తుందట. ఇప్పటికే ఆమె తెలుగు అటు బాలీవుడ్‌లో పలు ప్రాజెక్టులకు కమిట్ అయింది. ఈ సమయంలో ఆమెకు ఎన్టీఆర్ లాంటి టాప్ హీరో పక్కన ఛాన్స్ రావడం అంటే మామూలు అదృష్టం కాదని చెప్పాలి. అయితే సమంత మనసు ఎన్టీఆర్ సినిమా మీద ఉన్నా డేట్లు ఎలా ? సర్దుబాటు చేయాలో తికమకపడుతోందట.

ఎలా అయినా ఎన్టీఆర్ సినిమాలో నటించాలని సమంత గట్టి ప్రయత్నాలే ప్రారంభించిందని తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాత కళ్యాణ్ రామ్ బింబిసార సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఆ పని పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ఈ లోగా సమంత తన కాల్ షీట్లు సర్దుబాటు చేయగలిగితే మరోసారి ఎన్టీఆర్ – సమంత జోడిని మనం తెరమీద చూడొచ్చు. నిజంగా ఇది సమంతకు లక్కీ ఛాన్సే అనుకోవాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news