Moviesచియాన్ విక్ర‌మ్ ' కోబ్రా ' ట్రైల‌ర్ వ‌చ్చేసింది... మైండ్ దొబ్బేసిందిరా...

చియాన్ విక్ర‌మ్ ‘ కోబ్రా ‘ ట్రైల‌ర్ వ‌చ్చేసింది… మైండ్ దొబ్బేసిందిరా బాబు (వీడియో)

గ‌త కొన్నేళ్లుగా చియాన్ విక్ర‌మ్ కెరీర్ స‌రిగా లేదు. విక్ర‌మ్ రేంజ్‌కు త‌గిన హిట్ రావ‌డం లేదు. తాజాగా విక్రమ్‌ హీరోగా అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోబ్రా. ఈ సినిమాపై గ‌త కొంత కాలంగా సోష‌ల్ మీడియాలో బాగా చ‌ర్చ న‌డుస్తోంది. ఈ సినిమా స్టిల్స్ సినిమాపై అంచ‌నాలు పెంచేశాయి. ఈ సినిమా కంప్లీట్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కుతోంది.

ఈ కోబ్రాను సెవెన్ స్టూడియోస్ – రెడ్ జెయింట్ రీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమాలో విక్ర‌మ్‌కు జోడీగా కేజీఎఫ్‌ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ కోబ్రా ఈ నెల 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా రిలీజ్ అయిన ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాలు పెంచేసింది.

ట్రైల‌ర్ ఆద్యంతం మైండ్ బ్లోయింగ్గా ఉంది. ట్రైల‌ర్లో గణిత శాస్త్రవేత్తగా విక్రమ్‌ కనిపించనున్నారు. ట్రైలర్లో విక్ర‌మ్ ఐదు డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్ల‌లో క‌నిపిస్తున్నాడు. ఇర్ఫాన్ పఠాన్, మియా జార్జ్ , మృణాలిని రవి కీలక పాత్రల్లో కనిపిస్తుండ‌గా… ఏఆర్‌. రెహ్మ‌న్ సంగీతం అందిస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news