Movies"ఆగ్ లగా దేంగే"..ఇప్పుడు చెప్పవయ్య ఈ డైలాగ్..!?

“ఆగ్ లగా దేంగే”..ఇప్పుడు చెప్పవయ్య ఈ డైలాగ్..!?

ఆగ్ లగా దేంగే..ఆగ్ లగా దేంగే..ఆగ్ లగా దేంగే.. ఇప్పుడు ఇదే డైలాగ్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. ఈ డైలాగు మిగతా హీరోలు చెప్తే ఎలా ఉంటుందో తెలియదు.. కానీ, విజయ్ దేవరకొండ చెప్తే మాత్రం ఓ రేంజ్ లో ఉంటుంది అంటూన్నారు నెటిజన్స్. విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ప్రమోషన్స్ లో ఈ డైలాగ్ ను ఎంత బీభత్సం గా ప్రమోట్ చేశారో తెలిసిందే. పుష్ప సినిమాలో తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ కన్నా పాపులర్ గా ఆగ్ లగా దేంగే అంటూ విజయ్ దేవరకొండ గొంతు చించుకుని..కాలర్ ఎగరేసి మరి ఓ రేంజ్ లో చెప్పుకొచ్చాడు.


అప్పుడు విజయ్ దేవరకొండ చెప్పిన పద్ధతి.. ఆయన చేసిన హంగామా చూస్తే ఈ సినిమా ఇండియన్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాదు.. రికార్డులు పరంగా బాక్సాఫీస్ షేక్ చేస్తుంది అంటూ అనుకున్నారంతా , సీన్ కట్ చేస్తే నిన్న మొదటి బొమ్మ పడగానే మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది. ప్రమోషన్స్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ కనీసం సినిమా కథ కంటెంట్ మీద పెట్టుంటే అట్లీస్ట్ యావరేజ్ టాక్ అయినా దక్కించుకునేది అంటూ చెప్పుకొస్తున్నారు పూరి అభిమానులు.

అంతేనా సినిమా భారీ డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో పూరి పై విజయ్ దేవరకొండ అభిమానులు ఫైర్ అయిపోతున్నారు. ఇలాంటి సినిమా కోసం మా హీరో ని వాడుకుంటావా అంటూ పూరి జగన్నాథ్ ని కొందరు మండిపడుతుంటే మరికొందరు పూరి డైరెక్షన్ ఇంత వరస్ట్ గా ఉందా అంటూ చెప్పుకొస్తున్నారు. మరికొందరు ఇప్పుడు “చెప్పవయ్యా ఆగ్ లగా దేంగే ఈ డైలాగ్ నీ నోటితో ఇప్పుడు చెప్తే వినాలని ఉంది అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. మరికొందరు “వాళ్లు ముందు నుంచి చెప్తానే ఉన్నారు.. ఆగ్ లగా దేంగే , ఆగ్ లగా దేంగే, ఆగ్ లగా దేంగే ..మనకే అర్థమయ్యి సావాలా అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు . దీంతో లైగర్ సినిమాను బీభత్సంగా ట్రోల్ చేస్తూ జనాలు ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తానికి ఏదో ఊహించుకున్న విజయ్ దేవరకొండ.. మరేదో దక్కించుకుని,, ఏమీ కాకుండా.. అటు ఇటు కాకుండా ఇండస్ట్రీలో మిగిలిపోతున్నాడు అంటున్నారు కొందరు నెటిజన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news