MoviesNBK107 నుంచి బాల‌య్య కొత్త‌ లుక్ బ‌య‌ట‌కొచ్చింది... !

NBK107 నుంచి బాల‌య్య కొత్త‌ లుక్ బ‌య‌ట‌కొచ్చింది… !

అఖండ త‌ర్వాత నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్టుల్లో న‌టిస్తున్నాడు. బాలకృష్ణ –
ద‌ర్శ‌కుడు మ‌లినేని గోపీచంద్ కాంబోలో ఇప్పుడు ఓ ప‌వ‌ర్ ఫుల్ మాస్ యాక్ష‌న్ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన స్టిల్స్‌, ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్లు దుమ్ము రేప‌డంతో పాటు సినిమాపై అంచ‌నాలు పెంచేస్తున్నాయి. ఈ సినిమాలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ముందుగా ద‌స‌రా బ‌రిలో రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు.

అయితే మ‌ధ్య‌లో బాల‌య్య‌కు, సినిమా యూనిట్‌కు క‌రోనా రావ‌డంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ లేట్ అయ్యింది. వ‌చ్చే క్రిస్మ‌స్ లేదా సంక్రాంతి బ‌రిలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. రాయ‌లసీమ‌, రామోజీ ఫిల్మ్‌సిటీ, హైద‌రాబాద్ షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీం ప్ర‌స్తుతం టర్కీలో కొత్త షెడ్యూల్‌తో బిజీగా ఉంది. అక్క‌డే కొన్ని యాక్ష‌న్ సీన్ల‌తో పాటు ఒక పాట కూడా షూట్ చేస్తున్నారు.

తాజాగా ట‌ర్కీ షెడ్యూల్ నుంచి బాల‌య్య స్టిల్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఫొటోగ్రాఫ‌ర్ రిషి పంజాబి త‌న సోష‌ల్ ప్రొఫైల్ బాల‌య్య‌తో తీసుకుని దానిని షేర్ చేశాడు. ఈ ఫొటో అలా షేర్ చేసిన కొద్ది సేప‌టికే సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ లుక్‌కు ఇప్పుడు అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ సినిమాలో క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news