Moviesఈ ఇద్దరి ముద్దుగుమ్మలు విజయ్ తోనే డేటింగ్ కు వెళ్తారట..రౌడీ...

ఈ ఇద్దరి ముద్దుగుమ్మలు విజయ్ తోనే డేటింగ్ కు వెళ్తారట..రౌడీ హీరో ఆన్సర్ అదుర్స్..!!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ..ఇప్పుడు ఈ పేరు ఓ సెన్సేషన్. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ..విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరోకి గర్ల్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. అందులోను స్టార్ హీరోయిన్లు, స్టార్ డాటర్ కూతుళ్లు కూడా ఈయనకు బిగ్ డై హార్ట్ ఫ్యాన్స్ గా మారిపోయారు, అఫ్ కోర్స్ దాని అంతటికి కారణం..అర్జున్ రెడ్డి అనే సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా లో విజయ్ నటనా..రొమాన్స్..అబ్బో అది చెప్పితే అర్ధంకాదు ..చూస్తేనే ఆ మజా..

కాగా, అర్జున్ రెడ్డి తరువాత విజయ్ చాలా సినిమాలు చేశాడు. కానీ, ఆ స్దాయిలో ఏ సినిమా రీచ్ కాలేకపోయింది. కొన్ని బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇప్పుడు విజయ్ ఆశలన్ని లైగర్ సినిమా పైనే పెట్టుకుని ఉన్నాడు. ఈ సినిమాకోసం బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఈగర్ వెయిట్ చేస్తున్నారట. కాగా, రీసెంట్ కాఫీ విత్ కరణ్ షోకి గెస్ట్లు గా వెళ్లిన స్టార్ డాటర్స్ కమ్ హీరోయిన్స్..జాన్వీ కపూర్..సారా అలీ ఖాన్..ను కరణ్ ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడుగుతాడు.

హోస్ట్ కరణ్..సారా ను అడుగుతూ..”నువ్వు ఎవరితో నైనా డేట్‌ కు వెళ్లాలనుకుంటున్నావా? అతను ఎవరు?’ అని అడగ్గా.. సారా సిగ్గు పడుతూ.. రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ పేరు చెప్పుతుంది. ఈలోపే జాన్వీ షాక్ అవుతూ ఆశ్చర్యంగా చూస్తుంటే..కరణ్ గమనించి.. ‘ఏంటి నువ్వు కూడా విజయ్‌తోనేనా!’ అని అడుగుతాడు. ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోను విజయ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేస్తూ..”ఇంతటి అభిమానం చూపిస్తున్న మీకు నా గట్టి హగ్‌’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news