Moviesబాల‌య్య సినిమా షూటింగ్‌లో శృతీ అల్ల‌రి మామూలుగా లేదే...!

బాల‌య్య సినిమా షూటింగ్‌లో శృతీ అల్ల‌రి మామూలుగా లేదే…!

నటసింహా నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉన్నాడు. ఓ సినిమా సెట్స్ మీద ఉండ‌గానే.. వెంట‌నే మ‌రో సినిమాకు రెడీ అయిపోతున్నాడు. ప్ర‌స్తుతం క్రాక్ ద‌ర్శ‌కుడు మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌కత్వంలో న‌టిస్తోన్న బాల‌య్య‌.. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే అనిల్ రావిపూడి ద‌ర్శ‌కత్వంలో త‌న 108వ ప్రాజెక్టులో న‌టిస్తాడు. ఈ ప్రాజెక్ట్ కూడా సెప్టెంబ‌ర్ నుంచి షూటింగ్ స్టార్ట్ కానుంది.

ఈ సినిమా త‌ర్వాత పూరి జ‌గ‌న్నాథ్‌, మ‌ళ్లీ బోయ‌పాటి ప్రాజెక్టులు కూడా లైన్లో ఉన్నాయి. ఇక ప్ర‌స్తుతం మ‌లినేని గోపీ డైరెక్ష‌న్‌లో బాల‌య్య న‌టిస్తోన్న సినిమా షూటింగ్ క‌ర్నూలు జిల్లాలో శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. క‌ర్నూలు జిల్లాలో ప‌లు ప్రాంతాల్లో జ‌రుగుతోన్న ఈ షూటింగ్ చూసేందుకు బాల‌య్య అభిమానులు మాత్ర‌మే కాకుండా ప్ర‌జ‌లు అంద‌రూ తండోప‌తండాలుగా వెళుతున్నారు. బాల‌య్య‌ను క‌లిసేందుకు ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు, జిల్లా సెల‌బ్రిటీలు ఆస‌క్తి చూపుతున్నారు.

తాజాగా ఈ సినిమా షూటింగ్ నుంచి ఓ చిలిపి ఫొటో బ‌య‌ట‌కు వ‌చ్చింది. బాల‌య్య స‌హ‌న‌టుల్లో ఒక‌రు అయిన మీనా వాసుకి సెల్ఫీ కోసం స్నాప్ ఇచ్చారు. ఇందులో హీరోయిన్ శృతీహాస‌న్ చాలా ఫ‌న్నీగా ఫోజు ఇచ్చింది. నాలుక‌ను మడ‌త‌పెట్టి కొంటెచూపుల‌తో ఉన్న‌ట్టుగా ఉంది. సెల్ఫీ కోసం శృతీ చాలా అదురైన ఎక్స్‌ప్రెష‌న్స్ ఇచ్చింద‌నే చెప్పాలి. బాల‌య్య వెన‌కాలే వైట్ చూడీదార్ వేసుకుని సింపుల్‌గానే ఉంది. సెట్స్‌లో శృతీ బాగా అల్ల‌రి చేస్తూ సినిమాను ఎంజాయ్ చేస్తున్న‌ట్టుగా ఉంది.

ఇక బాల‌య్య కూడా ఫొటోలో చాలా సింపుల్‌గా ఉన్నాడు. ఇక తాజాగా ఈ సినిమాలో బాల‌య్య‌కు సంబంధించి రిలీజ్ అయిన బాల‌య్య గెట‌ప్ లుక్‌కు ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమాను ద‌స‌రాకు రిలీజ్ చేయాల‌ని అనుకుంటున్నా.. షూటింగ్ ఆల‌స్యం అయ్యే ఛాన్సులు ఉండ‌డంతో అఖండ సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ డిసెంబ‌ర్లో రిలీజ్ చేసే ప్లాన్స్ కూడా ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news