Moviesకొత్త ప్రియురాలితో హృతిక్ సీక్రెట్‌గా మొద‌లు పెట్టేశాడుగా....!

కొత్త ప్రియురాలితో హృతిక్ సీక్రెట్‌గా మొద‌లు పెట్టేశాడుగా….!

బాలీవుడ్ కండ‌ల వీరుడు హృతిక్ రోష‌న్ ప‌దేళ్ల క్రింద‌టే త‌న భార్య సుసానేకు విడాకులు ఇచ్చేశాడు. బాలీవుడ్ డైరెక్ట‌ర్ సంజ‌య్‌ఖాన్ కుమార్తె అయిన సుసానే హృతిక్‌కు చిన్న‌నాటి స్నేహితురాలు. హృతిక్ రోష‌న్ ఫ‌స్ట్ సినిమా క‌హోనా ప్యార్‌హై రిలీజ్ అయ్యే టైంకే వీరు పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉండ‌డంతో ఆ వెంట‌నే పెళ్లి చేసుకున్నారు. హృతిక్‌కు ఫ‌స్ట్ సినిమా క‌హోనా ప్యార్ హై సినిమాతో క్రేజ్ వ‌చ్చిన వెంట‌నే పెళ్ల‌వ్వ‌డంతో ఈ జంట దేశ‌వ్యాప్తంగా ఎట్రాక్ష‌న్‌గా ఉండేవారు. ఆ త‌ర్వాత కాలంలో ఈ జంట‌కు ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు.

ప‌దేళ్ల క్రిత‌మే వీరి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో ప‌ర‌స్ప‌ర అంగీకారం మేర‌కే విడాకులు తీసుకున్నారు. విడాకుల త‌ర్వాత ఎవ‌రి జీవితం వారు ఎంజాయ్ చేస్తున్నా పిల్ల‌ల కోసం మాత్రం క‌లిసి ఉంటున్నారు. త‌మ పిల్ల‌ల‌తో క‌లిసి విదేశీ వెకేష‌న్ల‌కు ఎన్నోసార్లు వెళుతూ మంచి త‌ల్లిదండ్రులు అనిపించుకుంటున్నారు. ఇక తాజాగా ఎవ‌రి రిలేష‌న్ల‌లో వారు మునిగిపోయారు.

ఈ క్ర‌మంలోనే హృతిక్ త‌న కొత్త ప్రియురాలు సాబా ఆజాద్‌తో క‌లిసి ఉంటున్నాడు. హృతిక్‌కంటే సాబా ఆజాద్ దాదాపు 18 సంవ‌త్స‌రాలు చిన్న‌ది అని తెలుస్తోంది. ఇప్పుడు వీరిద్ద‌రు క‌లిసి చేస్తోన్న రొమాన్స్‌లు, షికార్లు హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాయి. ప్ర‌స్తుతం వాళ్లిద్ద‌రు ముంబైలోని బాంద్రాలో సీక్రెట్‌గా ఓ ప్లాట్‌లో కాపురం కూడా మొద‌లు పెట్టేశార‌ట‌. ఇక ఇప్పుడు వీరిద్ద‌రు క‌లిసి సీక్రెట్‌గా తిరుగుతోన్న ఫొటోలు అయితే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

తాజాగా ముంబై ఎయిర్ పోర్టులో ఒక‌రి చేతిలో మ‌రొక‌రు చేయి వేసుకుని వెళుతున్న ఫొటోలు అయితే సోష‌ల్ మీడియాను క‌మ్మేశాయి. తాజాగా ఈ జంట ఫ్రాన్స్‌లో రొమాంటిక్‌గా త‌మ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి రొమాంటిక్ లైఫ్ చూస్తోన్న బీ టౌన్ మీడియాలో వీరు త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి ఎంట్రీ ఇస్తార‌ని కూడా వార్త‌లు రాస్తోంది. ఇక హృతిక్ మాజీ భార్య సుసానే కూడా మ‌రో రిలేష‌న్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

అస‌లు హృతిక్ – సుసానే విడిపోవ‌డానికి కార‌ణం బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ అన్న గుస‌గుస‌లు కూడా ఎప్ప‌టి నుంచో ఉన్నాయి. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే హృతిక్ అటు స‌బా ఇద్ద‌రూ క్రేజీ ప్రాజెక్టుల్లో న‌టిస్తున్నారు. హృతిక్ నెక్ట్స్ సైఫ్ ఆలీఖాన్‌తో క‌లిసి విక్ర‌మ్ వేద సినిమాలో క‌నిపించ‌నున్నాడు. ఓ త‌మిళ సినిమా రీమేక్ కంప్లీట్ చేశాడు. అలాగే దీపికా ప‌దుకొనేతో కలిసి ఫైట‌ర్ సినిమా చేస్తున్నాడు. ఈ భారీ యాక్ష‌న్ మూవీకి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. అటు స‌బా ఆజాద్ చివ‌ర‌గా ది రాకెట్ బాయ్స్ సినిమా చేసింది. ఆ త‌ర్వాత మినిమ‌మ్‌లో న‌టించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news