Moviesపెళ్ల‌య్యి పిల్ల‌లు పుట్టాక కూడా ప‌వ‌న్ ప‌క్క‌న హీరోయిన్‌గా చేసిన న‌టి...

పెళ్ల‌య్యి పిల్ల‌లు పుట్టాక కూడా ప‌వ‌న్ ప‌క్క‌న హీరోయిన్‌గా చేసిన న‌టి తెలుసా…!

కొంద‌రు హీరోయిన్లు పెళ్ల‌య్యాక కూడా క్రేజీ హీరోయిన్లుగానే ఉంటుంటారు. న‌దియా న‌జిమ్‌, ఫాహ‌ద్ ఫాజిల్‌ను పెళ్లి చేసుకుని చాలా యేళ్లే అయ్యింది. అయినా ఆమె తాజాగా వ‌చ్చిన నాని అంటే సుంద‌రానికి సినిమాలో చాలా గ్లామ‌ర్‌గా క‌నిపించింది. మాజీ ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వ‌ర్యారాయ్ కూడా పెళ్ల‌య్యాక ఎన్నో హిట్ సినిమాల్లో న‌టించింది. ఈ క్ర‌మంలోనే ఓ హీరోయిన్ కూడా పెళ్ల‌య్యి ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చాక కూడా సినిమాలు చేసింది.

అందులోనూ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా న‌టించింది. ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు అదితి గోవిత్రిక‌ర్‌. ఆమె ఇండియ‌న్ న‌టి. 21 మే, 1976లో జ‌న్మించింది. ప్ర‌స్తుతం ఆమె వ‌య‌స్సు 46 ఏళ్లు. ఆమె స్వ‌త‌హాగా డాక్ట‌ర్‌, మాజీ మోడ‌ల్ కూడా..! 2001లో మిస్సెస్ వ‌ర‌ల్డ్ టైటిల్ గెలుచుకుంది. ఈ టైటిల్ గెలుచుకున్న ఏకైక భార‌తీయ మ‌హిళ‌గా కూడా ఆమె రికార్డుల‌కు ఎక్కింది.

ఈ క్ర‌మంలోనే పీఏ. అరుణ్ ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన త‌మ్ముడు సినిమాలో ఆమె సెకండ్ హీరోయిన్ రోల్ చేసింది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా ప్రితీ జింగానియా న‌టించ‌గా.. అదితి రెండో హీరోయిన్గా చేసింది. త‌మ్ముడు సినిమాతోనే ఆమె వెండితెర‌కు హీరోయిన్గా ప‌రిచ‌యం అయ్యింది. ఆ త‌ర్వాత ఆమె 2012 వ‌ర‌కు చాలా సినిమాలు చేసింది. త‌ర్వాత వెబ్ సీరిస్‌ల్లో కూడా నటించింది.

చివ‌ర‌కు ప‌లు టెలివిజ‌న్ షోలు చేయ‌డంతో పాటు ఎన్నో అవార్డులు కూడా గెలుచుకుంది. 2009లో ఆమె బిగ్‌బాస్ 3లో కంటెస్టెంట్‌గా కూడా పాల్గొంది. త‌మ్ముడు సినిమాలో హీరోకు కాస్ట్‌లీ, రీచ్ ల‌క్ష‌ణాలతో కూడిన గ‌ర్ల్‌ఫ్రెండ్ కావాల‌నుకున్న‌ప్పుడు ద‌ర్శ‌కుడు అరుణ్ ప్ర‌సాద్ ఆమెనే సెల‌క్ట్ చేశారు. అదితి కూడా త‌న పాత్ర‌కు న్యాయం చేసింది. అప్ప‌టికే ఆమె పెళ్ల‌య్యి ఓ బిడ్డ కూడా ఉన్నాడు.

ఇక అదితి.. బాలీవుడ్ హాట్ ఆంటీ మ‌లైకా అరోరా ఇద్ద‌రూ బెస్ట్ ఫ్రెండ్స్‌. అదితి బాగా జిమ్‌లో వ‌ర్క‌వుట్లు చేస్తూ ఉంటుంది. మలైకాలాగా జిమ్‌లో వ‌ర్క‌వుట్లు చేయ‌డంతో పాటు హాట్ హాట్ డ్రెస్సులతో సోష‌ల్ మీడియాలో వేడెక్కిస్తూ ఉండేందుకే అదితి ఇష్ట‌ప‌డుతు ఉంటుంది. ఈత‌కొట్ట‌డం, బాక్సింగ్ చేయ‌డం కూడా ఆమె హాబీలే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news