Moviesజగపతి బాబు - సాక్షి శివానంద్... స‌ముద్రం సినిమా టైంలో అంత...

జగపతి బాబు – సాక్షి శివానంద్… స‌ముద్రం సినిమా టైంలో అంత తేడా కొట్టిందా…!

మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్టర్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది సాక్షి శివానంద్. మొదటి సినిమాతోనే అందాల ఆరబోతకు అస్సలు అడ్డు చెప్పనని తెరమీద చెప్పడంతో ఇండస్ట్రీ వర్గాల దృష్ఠిలో పడింది. ఇక మాస్టర్ సినిమా హిట్ సాధించడంతో వరుసగా తెలుగులో హీరోయిన్‌గా క్రేజీ మూవీస్ చేసే ఛాన్స్ దక్కించుకుంది. సాక్షి కి తెలుగులో ఎక్కువగా హిట్స్ రావడం కూడా ప్లస్ అయింది.

మాస్టర్ తర్వాత రాజ హంస, సీతారామరాజు, ఇద్దరు మిత్రులు, యువరాజు, సింహరాశి, యమజాతకుడు లాంటి సినిమాలు చేసింది. అయితే, అన్నిటికంటే కూడా సాక్షి శివానంద్ నటించిన సముద్రం సినిమా అప్పట్లో ఓ పెద్ద హాట్ టాపిక్. ఈ సినిమాలో అమ్మడు వెసిన బికినీ సూట్ గురించి కుర్రాళ్ల నుంచి 60 ఏళ్ళ ముసలాళ్ళ వరకూ మాట్లాడుకున్నారు. ఒక్క సాంగ్ సినిమా చూసిన ఆడియన్స్‌కి చమటలు పట్టి హీటెక్కేలా చేసింది. సాక్షి ఫిగర్ అద్భుతంగా ఉంటుంది. ఇక కృష్ణవంశీ దర్శకత్వం అంటే ఒక్క సాంగ్ లో అయినా హీరోయిన్ అందాలను బాగా చూపిస్తాడు.

అదే సముద్రం సినిమాలోనూ చేశారు. అయితే, ఈ సినిమాలో హీరోగా జగపతి బాబు నటించిన సంగతి తెలిసిందే. సినిమా ఫ్లాపయినా కూడా ప్రేక్షకులకు ఈ సినిమా బాగా ఎక్కింది. జగపతి బాబు, ప్రకాష్ రాజ్, తణికెళ్ల భరణి, శివాజీ రాజా పాత్రలు బాగా హైలెట్ అయ్యాయి. కానీ, సినిమాలో సూటవలేదనే కామెంట్స్ వినిపించింది మాత్రం సాక్షి శివానంద్ గురించే. జగపతి బాబుకి జంటగా సాక్షి శివానంద్ సెట్ అవదని అన్నారు.

చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు లాంటి వారికి జంటగా ఆదరించిన ప్రేక్షకులు జగపతిబాబు పక్కన చూడటానికి మాత్రం ఆసక్తి చూపించలేదు. ఒకరకంగా హీరోయిన్ విషయంలో కృష్ణవంశీ రాంగ్ ఛాయిస్ అని కామెంట్స్ చేశారు. పర్ఫార్మెన్స్ పరంగా ఆమె బాగా నటించిన ఈ సినిమాకు, అందులోనూ జగ్గుభాయ్ సరసన సెట్ అవలేదని అభిప్రాయపడ్డారు. ఇక ఈ సినిమాను కొంతవరకు నిలబెట్టింది అంటే మేకింగ్, శశిప్రీతం మ్యూజిక్ మాత్రమే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news