Moviesసాయి పల్లవి కూడా ఆ హీరో క్రేజ్ ని వాడుకుంటుందా..ఇంటర్వ్యులో బయట...

సాయి పల్లవి కూడా ఆ హీరో క్రేజ్ ని వాడుకుంటుందా..ఇంటర్వ్యులో బయట పడ్డ నిజం..?

యస్.. ఇప్పుడు ఇదే అంశం నెట్టింట తెగ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇన్నాళ్ళు సాయి పల్లవి అంటే ఓ దేవత, దివి నుంచి భువికి దిగ్గివచ్చిన ఓ దేవ కన్య..సూపర్ స్టార్, పవర్ స్టార్ అంటూ పొగిడేసిన జనాలే ఇప్పుడు ఆమెను..తిట్టేలా చేసుకుంది సాయిపల్లవి. రీసెంట్ గా ఆమె చేసిన “కాశ్మీరి ఫైల్స్” సినిమా కు సంబంధించిన వ్యాఖ్యలు ఎంత దుమారాని రేపాయో మనకు తెలిసిందే. సాయి కి బుద్ది లేదు అంటూ కొందరు సీనియర్ హీరోయిన్స్ కూడా కామెంట్స్ చేశారు.

మరి కొందరు అయితే ఏకంగా ఆమె సినిమాలని బ్యాన్ చేయలని డిమాండ్ చేశారు. కానీ, ఎట్టకేలకు సినిమాని రిలీజ్ చేసిన..కానీ, ఫలితం లేకపోయింది. సినిమా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ..సాయిపల్లవి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. కాగా, మరోసారి తన లోని నటనా టాలెంట్ ని చూయించడానికి “గార్గి” మూవీ తో మనముందుకు రాబోతుంది సాయిపల్లవి. ఈ సినిమా జూలై 15 న రిలీజ్ కాబోతుంది.

కాగా, ఈ మధ్య కాలంలో సాయి పల్లవి తరచూ ఓ స్టార్ హీరో పేరుని ఎక్కువుగా తన ఇంటర్వుల్లో ప్రస్తావిస్తూ వస్తుంది. ఆమె ఆయనకు బిగ్ ఫ్యాన్ అంటూ యాంకర్ అడిగిన అడగకపోయినా..తానే కలగజేసుకుని ఆయన పేరు మీడియా ముందు ప్రస్తావించడం సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. విరాటపరవం సినిమా టైంలో కూడా ఇలానే వెళ్లిన ప్రతి చోట..ఆయన పేరు జపిస్తూ..ఆయన ఫ్యాన్స్ ను ఉత్సాహ పరుస్తుంది. రీసెంట్ ఇంటర్వ్యుల్లోను అదే చేసింది. దీంతో ఆయన క్రేజ్ ని సాయి పల్లవి తన సినిమాలకు వాడుకుంటుంది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు జనాలు. మరి చూడాలి గార్గి మూవీతో అయిన హిట్ కొడుతుందో లేదో ఈ హైబ్రీడ్ పిల్ల..?

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news