Moviesహీరోగా ఓ వెలుగు వెలిగిన వేణు బ‌తుకు కోసం చికెన్ కొట్టు...

హీరోగా ఓ వెలుగు వెలిగిన వేణు బ‌తుకు కోసం చికెన్ కొట్టు పెట్టుకున్నాడా… ఆ హీరోయిన్‌తో ఎఫైర్ కూడా..!

సీనియర్ హీరో తొట్టెంపూడి వేణు హీరోగా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగాడు. దాదాపు ఆరు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని తాజాగా రవితేజ హీరోగా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో మళ్లీ వెండితెరపై రీఎంట్రీ ఇచ్చాడు. తాజా సినిమాలో వేణు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించడంతోపాటు తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు. మధ్యలో వేణు ఎన్టీఆర్ దమ్ము సినిమాలో ఎన్టీఆర్‌కు బావమరిది పాత్రలో నటించాడు.

ప్రస్తుతం పలు మీడియా సంస్థలకు, యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్న వేణు తన సినిమా కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉందని… మహేష్ బాబు అతడు సినిమాలో విలన్ గా నటించిన సోనూసూద్ పాత్రకు ముందుగా త్రివిక్రమ్ తనని అనుకున్నాడని… త్రివిక్రంకు తనకు మధ్య అంత సాన్నిహిత్యం ఉందని వేణు చెప్పాడు.

అతడు సినిమాలో వేణు విలన్ గా నటించి ఉంటే ఖ‌చ్చితంగా తన కెరీర్ మరోలా ఉండేదని చెప్పాడు. అలాగే పూరి జగన్నాథ్ తో కూడా తనకు ఎంతో సాన్నిహిత్యం ఉందని… దేశముదురు – ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాలు ముందుగా తనతోనే చేయాలని పూరి అనుకున్నాడని కూడా వేణు తెలిపాడు. మ‌ధ్య‌లో కొన్నేళ్ల పాటు వేణు అస‌లు ఇండ‌స్ట్రీలో క‌న‌ప‌డ‌లేదు. వేణుకు కుటుంబ ప‌ర‌మైన బిజినెస్‌లు చాలా ఉన్నాయి. అందులో బిజీ అయిపోయాడు.

దీంతో కొంద‌రు సినిమాల్లో ఛాన్సులు లేక‌, ఆర్థికంగా దెబ్బ‌తినేసి చికెన్ కొట్టు పెట్టుకున్నాడ‌ని రాసేశారు. యూట్యూబ్ ఛానెల్స్‌లో కూడా త‌న గురించి దారుణంగా థ‌మ్‌నెయిల్స్ పెట్టి వార్త‌లు వేశార‌ని వేణు వాపోయాడు. కొంద‌రు ఫ్రెండ్స్ కూడా చికెన్ కొట్టు పెట్టుకున్నావ‌ట క‌దా ? త‌న‌కు కిలో చికెన్ పంపించ‌మ‌ని స‌ర‌దాగా జోకులు వేసేవార‌ని వేణు చెప్పాడు. ఇలాంటి వార్త‌లు తాను చాలా చూశాన‌ని.. వాటి గురించి ప‌ట్టించుకోలేద‌ని చెప్పాడు.

ఇక వేణు కెరీర్ స్టార్టింగ్‌పై కూడా ఇలాంటి వార్త‌లే వ‌చ్చాయి. స్వ‌యంవ‌రం సినిమాలో వేణు – ల‌య జంట‌గా న‌టించారు. ఈ సినిమా హిట్ అయ్యి ఇద్ద‌రి కెరీర్‌కు స్ట్రాంగ్ పునాది వేసింది. ఈ సినిమాలో వారి కెమిస్ట్రీ బాగా పండింది. దీంతో కొంద‌రు ల‌య‌, వేణు ఎఫైర్ అని పుకార్లు పుట్టించారు. అయితే వీటిని వాళ్లిద్ద‌రు లైట్ తీస్కొన్నారు. ఇక రామారావు ఆన్ డ్యూటీతో రీ ఎంట్రీ ఇచ్చిన వేణు ఇక‌పై తాను రెగ్యుల‌ర్‌గా సినిమాలు చేస్తాన‌ని చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news