Moviesమహేష్ అభిమానులకు కోపం తెప్పించిన తమన్ ..అంత మాట అనేశాదు ఏంటి..?

మహేష్ అభిమానులకు కోపం తెప్పించిన తమన్ ..అంత మాట అనేశాదు ఏంటి..?

తమన్ ..ఈ పేరు గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ తన పేరుని ఇండస్ట్రీలో నమోదు చేసుకున్నాడు. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే..తన మ్యూజిక్ తో జనాలు మెస్మరైజ్ చేసిన సంగీత దర్శకుడు ఈ తమన్. ప్రస్తుతం సంగీత ప్రపంచంలో మారుమోగుతున్న పేరులలో తమన్ కూడా ఒకరు అని చెప్పక తప్పదు. ఈ మధ్య కాలలో ఈయన ట్యూన్ కట్టిన ప్రతి సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తున్నాయి. దీంతో బడా స్టార్స్ సైతం తమ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ నే కావాలంటూ అడిగి మరి పెట్టించుకుంటున్నారు.

ఈ సంవత్సరం తమన్ రెండు బ్లాక్ బస్టర్ సినిమాలకు సంగీతం అందించాడు. పవన్ భీమ్లా నాయక్ ..అలాగే మహేశ్ సర్కారు వారి పాట. అంతక ముందు అఖండ సినిమాకి అద్దిరిపోయే మ్యూజిక్ ఇచ్చి..సినిమా సక్సెస్ కి కారణమైయ్యారు. అంతేకాదు ఈయన మ్యూజిక్ ఇచ్చిన రాధే శ్యామ్ ఫ్లాప్ అయినప్పటికి..మ్యూజిక్ పరంగా మాత్రం తమన్ హిట్ అయ్యాడు. కాగా, నిన్న రిలీజ్ అయిన..NBK107 కి కూడా మ్యూజిక్ ఇచ్చింది తమన్ నే. టీజర్ లో బాలయ్య మాస్ డైలాగ్స్ కి..ఆ డ్రమస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్దిరిపోయింది. నందమూరి అభిమానులకు పూనకాళ్లు వచ్చేశాయి అంతే.

అయితే అలాంటి తమన్ పై మహేశ్ బాబు అభిమానులు గుర్రుగా ఉన్నారు. రవితేజ అభిమానులు కూడా కోపం గా ఉన్నారు. దానికి కారణం ఆయన ఆహా లో జడ్జీగా చేస్తున్న ఇండియన ఐడల్ షోలో ఆయన మాట్లాడిన మాటలే ..ఇప్పుడు నెట్టింట ఆయన ట్రోలింగ్ కు కారణమైయాయి. తెలుగు ఇండియన్ ఐడల్ మెగా ఫినాలే ప్రెస్‌మీట్‌ లో.. తమన్ తన కెరీర్‌లో 3 బ్లాక్‌బస్టర్ సినిమాలు “సరైనోడు, రేసు గుర్రం మరియు అలా వైకుంఠపురములో”.. అల్లు అర్జున్‌తో ఉన్నాయని చెప్పాడు.

బన్నీ ని ఓ రేంజ్ లో పొగిడేశారు. అయితే, మహేశ్ అభిమానులు ఈ పాయింట్ ని సీరియస్ గా తీసుకున్నారు. “బన్నీ ని పొగుడు తప్పులేదు..కానీ నీకు అదే మూడు హిట్లు ఇచ్చిన మహేశ్ ని ఎలా మర్చిపోయావు అంటూ తిట్టిపోస్తున్నారు. “బిజినెస్ మ్యాన్, దూకుడు, సర్క్కారు వారి పాట” మూడు సినిమాలు హిట్ అయ్యాయి” అంటూ చెప్పుకొస్తున్నారు. మరో పక్క రవితేజ ఫ్యాన్స్ “కిక్” సినిమాతోనే నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయమైయావు..మరి, రవితేజను ఎలా మర్చిపోయావు అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. దీంతో తమన్ ను నెట్టింట ట్రోల్ చేస్తున్నారు అభిమానులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news