Moviesమిమ్మల్ని చూస్తుంటే నా పేరు కూడా మరచిపోతా.. సమంతతో సద్గురు ముచ్చట్లు..!!

మిమ్మల్ని చూస్తుంటే నా పేరు కూడా మరచిపోతా.. సమంతతో సద్గురు ముచ్చట్లు..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎక్కడ ఉంటే అక్కడ సందడి వాతావరణం కనిపిస్తుంది అంటారు ఆమెతో వర్క్ చేసిన నటులు. సామ్ బిగ్ సెలబ్రిటీ అయినా కానీ, సెట్స్ లో మాత్రం అందరితో చాలా సరదాగా..ఫన్నీ గా ఉంటుందంటూ చెప్పుకొస్తారు. సమంత ఇంటర్వ్యుల్లో పాల్గొన్న హోస్ట్లు కూడా చాలా మంది ఇదే విషయాని ఓపెన్ గా చెప్పారు. సమంత చాలా నాటీ..చాలా అల్లరి పిల్ల..తనతో మాట్లాడుతుంటే టైం తెలియదు అని చాలా సంధర్భాలల్లో విన్నాం.

ప్రజెంట్ సమంత ఫుల్ స్వింగ్ మీద ఉంది. మామూలు టైం కన్నా కూడా విడాకుల తరువాత ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ..సరదాగా అభిమానులతో ముచ్చటిస్తుంటుంది. ఆమె నటించిన శాకుంతలం, యశోద సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. మరో వైపు వరుస సినిమాలకి కమిట్ అవుతూ..బిజీ గా ఉంటుంది. అయితే, రీసెంట్ గా సమంత హైదరాబాద్ లో సద్గురుతో జరిగిన సేవ్ సాయిల్ కార్యక్రమంలో పాల్గొంది. సద్గురుని సామ్ ఇంటర్వ్యూ చేసింది. దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఈ ఇంటర్వ్యుల్లో వీళ్లిద్దరి మధ్య చాలా ఫన్నీ మాటలు నడిచిన్నట్లు తెలుస్తుంది. కాసేపు సద్గురు తో సరదాగా ముచ్చటించిన సామ్..ఎల్లో అండ్ బ్లాక్ కలర్ శారీ లో మెరిసిపోయింది. చూడగానే ఆకట్టుకునే విధంగా ఉన్న సామ్ పిక్స్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఇంటర్వ్యు స్టార్ట్ అయ్యినప్పుడు సద్గురు ..సమంత తో సరదాగా మాట్లాడారు.

“సమంత ఈ ఇంటర్వ్యుకి లేట్ గా వచ్చింది. ఎవ్వరో లాస్ట్ మినిట్ లో చెప్పిన్నత్లు ఉన్నారు నేను ఎల్లో కుర్తా వేసుకున్నాను అని. అందుకే సమంత లాస్ట్ మినిట్ లో ఎల్లో శారీ కట్టుకుని వచ్చిందంటూ ” చెప్పుకొచ్చారు. ఇక సామ్ కూడా నవ్వుతూ..”నేను ఎవ్వరి నైన ఇంటర్వ్యు చేయాలి అంటే ఇలా పేపర్ లో రాసుకోను..కనీ, ఫస్ట్ టైం మీతో ఇంటర్వ్యు అనగానే ఇలా రాసుకున్నాను. మిమ్మల్ని చూస్తుంటే న పేరు కూడా మర్చిపోతా..” అంటూ సరదాగా మాత్లాడింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news