Moviesబాల‌య్య మూవీలో సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్‌.. ఎలాంటి పాత్రో తెలుసా?

బాల‌య్య మూవీలో సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్‌.. ఎలాంటి పాత్రో తెలుసా?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ `అఖండ‌`తో లాంగ్ గ్యాప్ త‌ర్వాత భారీ హిట్ ను ఖాతాలో వేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈయ‌న గోపీచంద్ మాలినేనితో త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను ప‌ట్టాలెక్కించారు. `ఎన్‌బీకే 107` వ‌ర్కింగ్ టైటిల్‌తో సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ మూవీని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

ఇందులో శ్రుతి హాస‌న్ హీరోయిన్ హీరోయిన్‌గా న‌టిస్తుంటే.. బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్, మ‌రో కీల‌క పాత్ర‌లో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ చేస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ మూవీ త‌ర్వ‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా అనంత‌రం స‌క్సెస్ ఫుల్ గోపీచంద్ మ‌లినేనితో బాల‌య్య ఈ చిత్రాన్ని స్టార్ట్ చేయ‌బోతున్నాడు.

`ఎన్‌బీకే 108` వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీపి ఇప్ప‌టికే అధికారికంగా అనౌన్స్ చేశారు. తండ్రీకుతుళ్ల మ‌ధ్య సాగే యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ చిత్ర‌మిది. ఇందులో న‌ల‌బై ఏళ్ల తండ్రి పాత్ర‌లో బాల‌య్య‌, ఆయ‌న కూతురిగా యంగ్ బ్యూటీ శ్రీ‌లాల అల‌రించ‌బోతున్నారు. పోస్ట్ ప్రొడెక్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటున్న ఈ మూవీ సెప్టెంబ‌ర్ లేదా అక్టోబ‌ర్‌లో సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. ఈ చిత్రంలో సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ న‌టించ‌బోతున్నార‌ట‌. అయితే ఇది విలన్ రోల్ కాద‌ట‌. బాలయ్య స్నేహితుడిగా, ఓ కామెడీ రోల్ ను​ రాజ‌శేఖ‌ర్ చేయబోతున్నారని అంటున్నారు. మరో ఇంట్ర‌స్టింగ్ విష‌యం ఏంటంటే.. ఈ మూవీలో రాజ‌శేఖ‌ర్ ఒరిజినల్​ వాయిస్​లోనే మాట్లాడి, మంచి వినోదాన్ని పండిస్తార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news