Moviesనందమూరి ఫ్యాన్స్ ఊపు తెప్పించే టైటిల్..బాలయ్య క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ మ్యాచ్...

నందమూరి ఫ్యాన్స్ ఊపు తెప్పించే టైటిల్..బాలయ్య క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ మ్యాచ్ ..?

నందమూరి నట సింహం బాలకృష్ణ వరుస సినిమాలకు కమిట్ అవుతూ.. అభిమానులకు కొత్త ఉత్సాహాని అందిస్తున్నారు. బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన అఖండ సినిమాతో తిరుగులేని విజయాని తన ఖాతాలో వేసుకున్న బాలయ్య..ప్రజెంట్ గోపీచంద్ మల్లినేని డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే సగం సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నా NBK107..సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజై ..నందమూరి అభిమానులకు ఫుల్ మీల్స్ అందించింది.

ముఖ్యంగా బాలయ్య నోటి నుండి అలాంటి మాస్ డైలాగ్స్ వింటుంటే..అభిమానులకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా బాలయ్య కెరీర్లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ గా నిలవబోతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక ఈ సినిమా పూర్తి అవ్వగానే బాలయ్య..అనిల్ రావిపూడితో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు. ఈ సినిమాను మొదట యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాలని భావించిన అనిల్ కి..F3 సినిమా చూసిన బాలయ్య..కామెడీ పండించే విధంగానే సినిమా తీద్దాం అని చెప్పుకొచ్చారట.

కాగా, ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియమణి సెలక్ట్ అయ్యిన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో బాలయ్య కి కూతురుగా కుర్ర బ్యూటీ శ్రీలీల నటించబోతుందని ముందే చెప్పేసి అనిల్ రావిపూడి సినిమాపై హైప్స్ పెంచేశారు. ఇక ఇప్పుడు NBK 108 కి సంబంధించి అద్దిరిపోయే న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.

ఈ సినిమా కి ఎన్నో టైటిల్స్ ఆలోచించిన అనిల్..ఫైనల్ గా బాలయ్య మ్యానరిజం మ్యాచ్ అయ్యేలా..”ఐ డోంట్ కేర్”..అనే టిటిల్ ని ఫిక్స్ చేసిన్నట్లు తెలుస్తుంది. త్వరలో నే ఈ సినిమా టైటిల్ ని రిజిస్టర్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. “బాలయ్య క్యారెక్టర్ కి ఈ టైటిల్ అయితే సూపర్ పర్ ఫెక్ట్..కంటిన్యూ” అనిల్ అంటూ నందమూరి అభిమానులు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. సినిమా టైటిల్ తోనే సగం హిట్ కొట్టేశాడు అనిల్ అని అంటున్నారు అభిమానులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news