Movies' ఒక్క‌డు ' సినిమాలో న‌టించే ఛాన్స్ మిస్ చేసుకున్న క్రేజీ...

‘ ఒక్క‌డు ‘ సినిమాలో న‌టించే ఛాన్స్ మిస్ చేసుకున్న క్రేజీ హీరోయిన్‌..!

చాలా మంది హీరోయిన్లు త‌మ‌కు వ‌చ్చిన మంచి ఛాన్స్‌ల‌ను మిస్ చేసుకుంటారు. తీరా ఆ సినిమా హిట్ అయ్యాక అరే భ‌లే ఛాన్స్ మిస్ చేసుకున్నామే అని బాధ‌ప‌డుతూ ఉంటారు. కొంద‌రు హీరోయిన్లు అయితే ఏకంగా స్టార్ హీరోల సినిమాల ఛాన్సులు వ‌దులుకుని త‌మ కెరీర్‌లో పెద్ద రాంగ్ స్టెప్ వేస్తారు. స‌రిగ్గా ఓ హీరోయిన్ కూడా అలాంటి రాంగ్ స్టెప్పే వేసింది. అది కూడా ఏకంగా సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబుతో… ఒక్క‌డు లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలో న‌టించే ఛాన్స్‌..!

మ‌హేష్‌బాబు కెరీర్‌లో 7వ సినిమాగా తెర‌కెక్కిన ఒక్క‌డు సినిమా 2003 సంక్రాంతి కానుక‌గా రిలీజ్ అయ్యింది. 130 కేంద్రాల్లో 100 రోజులు ఆడి పెద్ద సెన్షేష‌న్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో భూమిక హీరోయిన్‌గా న‌టించ‌గా… సుమంత్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఎంఎస్‌. రాజు నిర్మించారు. మ‌హేష్‌బాబును తిరుగులేని సూప‌ర్‌స్టార్‌ను చేయ‌డంతో పాటు తిరుగులేని ఇమేజ్ రావ‌డానికి బ‌ల‌మైన పునాది వేసింది.

అయితే ఈ సినిమాకు ముందు నిర్మాత రాజు మ‌న‌సంతా నువ్వే సినిమా కూడా నిర్మించారు. ఉద‌య్ కిర‌న్ – రీమాసేన్ జంట‌గా న‌టించిన ఈ సినిమా కూడా సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌న‌సంతా నువ్వేతో పాటు ఒక్క‌డు సినిమా క‌థ కూడా రీమాసేన్‌కు చెప్పార‌ట‌. అయితే రీమాసేన్ మాత్రం తాను మ‌న‌సంతా నువ్వే సినిమాయే చేస్తాన‌ని చెప్పింద‌ట‌. అదే టైంలో భూమికకు కూడా రెండు సినిమాల క‌థ‌లు చెప్ప‌గా… తాను ఏదో ఒక సినిమా మాత్ర‌మే చేస్తాన‌ని చెప్పింద‌ట‌.

దీంతో రీమాసేన్ కోరిక మేర‌కు ఆమెను మ‌న‌సంతా నువ్వే సినిమాలో హీరోయిన్‌గా తీసుకుని.. ఒక్క‌డులో భూమిక‌ను పెట్టారు. అయితే ఈ రెండు సినిమాలు సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో పాటు ఇద్ద‌రు హీరోయిన్ల‌కు మంచి పేరు తీసుకువ‌చ్చాయి. అయితే ఒక‌వేళ రీమాసేన్ మ‌హేష్‌బాబుకు జోడీగా ఒక్క‌డు సినిమా చేసి ఉంటే ఆమెకు ఆ త‌ర్వాత పెద్ద హీరోల ప‌క్క‌న ఖ‌చ్చితంగా ఛాన్సులు వ‌చ్చి ఉండేవి.

మ‌న‌సంతా నువ్వే హిట్ అయినా మీడియం రేంజ్ హీరోగా ఉన్న ఉద‌య్‌కిర‌ణ్ ప‌క్క‌న న‌టించ‌డంతో ఆమెకు ఆ త‌ర్వాత పెద్ద సినిమాల్లో ఛాన్సులు రాలేదు. ఇక ఒక్క‌డు త‌ర్వాత భూమిక‌కు సింహాద్రితో పాటు పెద్ద హీరోల సినిమాల్లో వ‌రుస‌గా ఛాన్సులు వ‌చ్చాయి. ఇక ఈ రెండు సినిమాల నిర్మాత ఎంఎస్‌. రాజు తాజాగా నిర్మించిన 7 డేస్ 6 నైట్స్ సినిమా త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news