Moviesమహేష్‌ ముందే ఆయన్ని బూతులు తిట్టిన భూమిక..సంచలన మ్యాటర్ లీక్...

మహేష్‌ ముందే ఆయన్ని బూతులు తిట్టిన భూమిక..సంచలన మ్యాటర్ లీక్ చేసిన నిర్మాత..!!

భూమిక..ఓ అందాల బొమ్మ..చుడటానికి చాలా చక్కగా..సన్నగా..నాజుకుగా..పర్ఫెక్ట్ సైజ్ లని మెయిన్ టైన్ చేస్తూ..జనాలను ఆకట్టుకుంటుంది. భూమిక తెలుగు ఇండ‌స్ట్రీలో కుర్రాళ్ల‌కు తార‌క‌మంత్రం ఈ పేరు. భూమిక అనగానే మనకు ముందు గుర్తు వచ్చేది ఖుషీ సినిమానే. అమ్మడు కెరీర్ లో ఎన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నా..ఖుషీ సినిమా ఎప్పటికి ప్రత్యేకమే. నిజానికి ఈ సినిమాతోనే స్టార్ హీరోయిన్ ల లిస్ట్ లోకి చేరిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. ఆ సినిమాలో అమ్మడు నడుము సీన్ ఇప్పటికీ సంచలనమే. ఆ తర్వాత వరస సినిమాలు చేసి ఓ దశలో నెంబర్ వన్ పీఠానికి చేరువైంది.

అమాయకత్వంతోనే దక్షిణాదిన మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ భూమిక చావ్లా.. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే బడా బడా హీరోలతో నటించే ఛాన్స్ లు అందుకుంది. అంతేనా తీసిన ప్రతి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా..కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులు క్రియేత్ చేసేవి. దీంతో అమ్మడు ఓ స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. ఇక తాజాగా భూమిక గురించిన సంచలన విషయం బయటపెట్టిన్నట్లు తెలుస్తుంది నిర్మాత రాజు..అదేనండి ఎం ఎస్‌రాజు. బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించడంలో ఈయన తర్వాతే ఎవ్వరైన..అప్పట్లో ఎం ఎస్‌రాజు.. అంటే బ్లాక్ బస్టర్ సినిమాలకి చిరునామ.

ప్రజెంట్ ఈయన తన కొడుకు హీరో సుమంత్ ని పెట్టి 7 డేస్​ 6 నైట్స్ అనే ఓ రొమాంటిక్ సస్పెన్స్ ధ్రిలర్ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఆలీతో సరదాగా షోలో పాల్గొని సందడి చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. షో లో ఆయన చాలా ఆసక్తికర విషయాల గురించి చెప్పుకొచ్చిన్నట్లు ప్రోమో చూస్తేనే అర్ధమైపోతుంది.

షో లో ఆయన మాట్లాడుతూ..”ఒక్కడు సినిమా షూటింగ్‌లో టైంలో భూమిక చేసిన పని ఇప్పటికి మర్చిపోలేము. నేను, మహేశ్, భూమిక ముగ్గురం పక్క పక్కనే కూర్చుని ఉన్నాం..సడెన్ అక్కడికి వచ్చిన ఫైటర్‌పై భూమిక బాగా సీరియస్​ అవుతూ గట్టిగా ఏదో ఇంగ్లీష్ లో అరిచింది. ఏం తిట్టిందో తెలియదు.,కానీ చాలా భయంకరంగా ఉంది ఆ పదం..అంటూ ప్రోమో ని కట్ చేశారు. దీంతో ఎంఎస్ రాజు మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి అసలు ఏం జరిగిందనేది మాత్రం ఫుల్‌ ఎపిసోడ్‌ చూస్తేగానీ తెలియదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news