Moviesవారసులకు కొత్త భయం..టైం మూడిందా..?

వారసులకు కొత్త భయం..టైం మూడిందా..?

మనం బాగా గమన్నించిన్నట్లైతే సినీ ఇండస్ట్రీలోకి ఎవ్వరి సపోర్ట్..ఎటువంటి సినీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇక్కడకు వచ్చి..హీరోగా సెటిల్ అయిన వారు చాలా తక్కువ. ఫింగర్ కౌంటింగ్స్ చేయచ్చు. అది ఏ ఇండస్ట్రీ అయినా సరె. తెలుగు, తమిళ, కన్నడ, మళయాలం..అన్ని ఇండస్ట్రీలోను తమ వారసులను దింపి తరతరాలుగా ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. మరో తరానికి కూడా బెర్తులు రిజర్వ్ చేసుకుంటున్నారు. తమ బిడ్డలని చైల్డ్ ఆర్టిస్ట్లు గా సినిమాలోకి ఎంట్రీ ఇప్పిస్తూ..ముందునుండే పక్క ప్లాన్ తో ప్రిపేర్ గా ఉన్నారు.

ఇక ఎప్పటిలాగే ఈ వారసుల పై చెయ్యికి సామాన్య టాలెంట్ తొక్కేస్తున్నట్లు దిగ్గిపోయింది. కానీ, ప్రజెంట్ పరిస్ధితి చూస్తుంటే ఇండస్ట్రీలో మార్పులు వచ్చిన్నట్లు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా పుణ్యమా అని తమలోని టాలెంట్ ను బయట పెట్టి..మెల్లగా ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తూ..చిన్న సినిమాలతో హీరో గా ఎంట్రీ ఇస్తూ..బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తున్నారు కుర్ర హీరోలు. పాన్ ఇండియా సినిమాలు అంటూ కోట్లకి కోట్లు పెట్టి..సినిమా నిర్మాతలని ముంచేయకుండా..చిన్న బడ్జెట్ సినిమాలతో సింపుల్ స్టోరీలతోనే సూపర్ డూపర్ హిట్లను తమ ఖాతాలో వేసుకుంటున్నారు.

ఈ ఈ మధ్యనే వచ్చిన DJ టిల్లు, అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద ఎంత హిట్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. స్టార్ హీరోలు అంటూ చెప్పుకునే సో కాల్డ్ వారసుల సినిమాలు కూడా బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఏకంగా 100 కోట్లు నష్టం వచ్చేలా చెత్త రికార్డ్లు మూటకట్టుకున్నాయి. మరి ఇలాంటి టైం లో పెట్టిన బడ్జెట్ కి డబుల్ ప్రాఫిట్స్ తెస్తున్న ఈ కుర్ర హీరోలే నయం అంటున్నారు కొందరు నిర్మాతలు. అందుకే బడా హీరోలతో కోట్లు నష్టపోవడం కన్నా.. చిన్న హీరోలతో పెట్టిన డబ్బులకు న్యాయం జరిగితే చాలు అంటూ నిర్మాతలు యంగ్ హీరోల పై చూపు తిప్పుకుంటున్నారు. ఇక ఇదే ప్రాసేస్ కంటీన్యూ అయితే..అమ్మ, నాన్న, తాత పేర్లు చెప్పుకుని ఇండస్ట్రీకి వచ్చిన వారసుల పరిస్ధితి ఏంటో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news