Moviesఅస‌లు ఆచార్య నుంచి త్రిష ఎందుకు ? త‌ప్పుకుంది... కొర‌టాల‌తో విసిగిపోయిందా...!

అస‌లు ఆచార్య నుంచి త్రిష ఎందుకు ? త‌ప్పుకుంది… కొర‌టాల‌తో విసిగిపోయిందా…!

ఎందుకో కానీ ఆచార్య సినిమా చూసిన సగటు సినిమా అభిమాని మాత్రమే కాదు… మెగాస్టార్ చిరంజీవి అభిమానులు సైతం పెదవి విరుస్తున్నారు. సినిమా ఏ మాత్రం అంచనాలు అందుకో లేదని ఒక్క ముక్క లోనే చెప్పేస్తున్నారు. మెగాస్టార్ లాంటి స్టార్ హీరో పక్కన హీరోయిన్ లేకపోవటం కూడా ఒక మైనస్ అయిందని అంటున్నారు. ముందుగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా తీసుకున్నారు. చిరంజీవి వయస్సు 66 యేళ్లు… ఎంత కుర్ర హీరోగా క‌న‌ప‌డేందుకు ట్రై చేస్తున్నా సీనియర్ హీరోలతో పాటు చిరంజీవికి హీరోయిన్ల కొరత వేధిస్తోంది.

చిరంజీవి పదేళ్ల గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చాక ప్రతి సినిమాకు హీరోయిన్‌ను వెతుక్కోవాల్సి వస్తోంది.
ఖైదీ నెంబర్ 150 సినిమాకు కాజల్ ను తీసుకున్నారు. సైరాలో తమన్నా – నయనతార నటిస్తే ఇప్పుడు ఆచార్యకు ముందుగా త్రిష పేరు పరిశీలించారు. దర్శకుడు కొరటాల శివ కథ కూడా చెప్పారు. అయితే ముందు చెప్పిన క‌థ వేరు.. త‌ర్వాత తీస్తోన్న సీన్లు వేరు కావ‌డంతో త్రిష్ త‌ప్పుకుంది.

త్రిష తప్పుకోవడంతో మళ్లీ కాజల్ ను ఒప్పించి ఆమెతో ఒక పాటతో పాటు కొన్ని సీన్లు కూడా షూట్ చేశారు.
మొన్న సినిమా రిలీజ్ కు ముందు ప్రమోషన్లలో దర్శకుడు కొరటాల శివ కాజల్ పాత్ర లేదని చెప్పేంతవరకు విషయం చాలా మందికి తెలియదు. అదలా ఉంటే ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ గా ఎంపికైంది త్రిష. సినిమా నుంచి ఆమె స‌డెన్‌గా ఎందుకు ? తప్పుకుంది… ఆమెకు మేక‌ర్స్‌కు ఎక్కడ చెడింది అన్నదానిపై ఇండస్ట్రీలో ఇపుడు రకరకాల టాక్‌లు బయటికి వస్తున్నాయి.

చిరంజీవి పక్కన హీరోయిన్ గా చేసేందుకు కుర్ర హీరోయిన్లు ఒప్పుకోవటం లేదు. ఎట్టకేలకు ముందుగా దర్శకుడు కొరటాల శివ త్రిష‌ను ఒప్పించాడు. గతంలో త్రిష – చిరంజీవి కలిసి స్టాలిన్ సినిమాలో నటించారు. ఇప్పుడు త్రిష‌కు ఏజ్ బార్ కావడంతో తక్కువ అవకాశాలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో మెగాస్టార్ సినిమా కావడంతో ఆమె వెంటనే ఓకే చెప్పేసింది. కథలో ఏదో గందరగోళం ఆమెకు అర్థం కాలేదు. కొర‌టాల మార్పులు, చేర్పుల‌తో విసిగిపోయే ఆమె సింపుల్‌గా క్రియేటివ్ డిఫరెన్స్ అని చెప్పి తప్పించుకుంది.

అప్పుడే ఏదో తేడా కొడుతుంది అనుకున్నారు. అయితే చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగి మణిరత్నం సినిమాకి కాల్షీట్లు సర్దుబాటు చేయలేక త్రిష తప్పుకుందని చెప్పారు. చిరంజీవి స్వయంగా త్రిష ఎందుకు ? తప్పుకుందో కారణం చెప్పినా ఆమె మాత్రం దానిని అంగీకరించలేదు. ఆ తర్వాత వెతికి వెతికి మరీ కాజల్‌ను తెచ్చారు చివరకు ఆమె సీన్లు షూట్ చేసి కూడా కట్ చేసి పడేశారు.

ఏదేమైనా ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో సరైన ప్రాధాన్యం లేదని ముందు నుంచి జరుగుతున్న పరిణామాలు స్పష్టంగా చెబుతున్నాయి. చివరకు త్రిష అనుకున్నట్టే ఆ పాత్రకు ప్రాధాన్యం లేదు. అందుకే కాజల్ ను తీసుకువచ్చి ఒక పాటతో పాటు కొన్ని సీన్లు షూట్ చేసి మరీ హీరోయిన్ పాత్రే ఎత్తేశారు. ఈ పొర‌పాటు కూడా సినిమా మైన‌స్‌ల‌లో ఒక‌టిగా నిలిచింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news