Moviesస‌మంత‌తో నాగార్జున భేటీకి అస‌లు కార‌ణం ఇదే.. త్వ‌ర‌లో గుడ్ న్యూస్‌...!

స‌మంత‌తో నాగార్జున భేటీకి అస‌లు కార‌ణం ఇదే.. త్వ‌ర‌లో గుడ్ న్యూస్‌…!

అక్కినేని నాగచైతన్య – సమంత జంట విడాకుల త‌ర్వాత ఏదో ఒక ఇంట్ర‌స్టింగ్ న్యూస్ ఈ జంట గురించి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూనే వ‌స్తోంది. విడాకుల త‌ర్వాత చైతు, స‌మంత ఇద్ద‌రూ ఎవ‌రి సినిమా విష‌యాల్లో వారు బిజీగా ఉంటున్నారు. చైతు, స‌మంత ఇద్ద‌రూ కూడా పోటాపోటీగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇద్ద‌రూ కూడా బాలీవుడ్ సినిమాలు చేస్తున్నారు. పైగా ఇద్ద‌రు త‌మ సినిమాల‌తో ఒకేసారి పోటీ ప‌డుతున్నారు.

 

చైతు అమీర్‌ఖాన్‌తో న‌టించిన లాల్‌సింగ్ చ‌ద్దా ఆగ‌స్టు 11న వ‌స్తుంటే, స‌మంత న‌టించిన థ్రిల్ల‌ర్ మూవీ య‌శోద ఆగ‌స్టు 12న రిలీజ్ అవుతోంది. విడాకుల త‌ర్వాత చైతు పెద్ద‌గా సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా లేడు. కాంట్ర‌వ‌ర్సీ పోస్టులు కూడా పెట్ట‌లేదు. స‌మంత మాత్రం అనేకానేక అర్థాలు, సందేహాల‌కు తావిచ్చేలా పోస్టులు పెడుతూ వ‌చ్చింది.

ఇలా ఎవ‌రి దారుల్లో వారు బిజీగా ఉన్న వేళ ఇప్ప‌డు నాగార్జున చేసిన ప‌ని రెండు, మూడు రోజులుగా మీడియాతో పాటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వైర‌ల్‌గా మారింది. నాగార్జునకు స‌మంత అంటే ఎంతో ఇష్టం. స‌మంత నాగ్‌ను ఎన్నోసార్లు బ‌హిరంగ వేదిక‌ల మీదే నాగ్ మామ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉండేది. విడాకుల త‌ర్వాత కూడా నాగ్ స‌మంత మా ఇంటి ఆడ‌బిడ్డే.. ఆమె అంటే గౌరవం ఉంద‌ని చెప్పాడు.

తాజాగా నాగార్జున నేరుగా వెళ్లి త‌న మాజీ కోడ‌లు స‌మంత నాన్న‌ను క‌లిశాడ‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. గంట‌పాటు వీరిద్ద‌రు చ‌ర్చించుకోగా.. స‌మంత – చైతు భ‌విష్య‌త్తు బాగుండేందుకు ఏం చేస్తే బాగుంటుంద‌న్న దానిపై కూడా వీరి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. అక్క‌డే స‌మంత కూడా ఉండడంతో నాగ్‌.. స‌మంత‌తోనూ మాట్లాడిన‌ట్టు చెపుతున్నారు.

నాగ్ మ‌ళ్లీ చైతుకు పెళ్లి చేసేందుకు డిసైడ్ అయ్యారు. ఈ రెండో పెళ్లికి ఎలాంటి అభ్యంత‌రాలు ఉండ‌కూడ‌ద‌నే సామ్‌ను, ఆమె తండ్రిని క‌లిసిన‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా త్వ‌ర‌లోనే చైతు రెండో పెళ్లిపై ఓ గుడ్‌ న్యూస్ మ‌నం విన‌వ‌చ్చ‌నే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్ ?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news