Moviesరాజమౌళి చేయలేని పని..మహేష్ చేశాడుగా.."సూపర్" స్టార్ నా మజాకా..!!

రాజమౌళి చేయలేని పని..మహేష్ చేశాడుగా..”సూపర్” స్టార్ నా మజాకా..!!

ఈరోజుల్లో సినిమా ని తెరకెక్కించడం గొప్ప విషయం ఏమి కాదు.. ఆ సినిమాని ఎలా ప్రమోట్ చేసుకున్నాము అన్నదే ఎక్కువుగా చూస్తున్నారు జనాలు. తెర వెనుక వాళ్ళు పడిన కష్టం మనకు తెలియాలి అంటే..ప్రమోషన్స్ లోనే తెలియాలి. సినిమా ప్రమోషన్స్ చేయడంలో దర్శకధీరుడు రాజమౌళి తరువాతనే ఎవ్వరైనా..అని అంటారు అందరు. అందరు డైరెక్టర్లు నెల ముందు.. 10 రోజుల ముందు సినిమాకి ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తే రాజమౌళి ఏకంగా మూడు నెలల ముందు నుంచే పక్కా ప్లానింగ్ తో RRR సినిమాకి అద్దిరిపోయే రేంజ్ లో ప్రమోషన్స్ చేశారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

RRR సినిమాకు సంబంధించి ఎన్ని రకాల ప్రమోషన్స్ చేయాలో అన్నీ చేసేసి అందులో మాస్టర్ అనిపించుకున్నాడు రాజమౌళి. కానీ, రాజమౌళి ఎన్ని ప్రమోషన్స్ చేసినా..మహేష్ బాబు అందుకున్న రికార్డ్ అందుకోలేకపోయాడు. దీంతో మహేష్ బాబు పేరు నెట్టింట మారుమ్రోగిపోతుంది. డైనమిక్ డైరెక్టర్ పరశూరాం డైరెక్షన్ లో మహేశ్ హీరో గా నటించిన చిత్రం “సర్కారు వారి పాట”. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మే 12 న గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్ ని స్పీడ్ అప్ చేశారు సర్కారు వారి పాట టీం.

ఈ క్రమంలోనే మే 7న హైదరబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. దీంతో మహేష్ బాబి అభిమానులు ఎలాగైన సర్కారు వారి పాటను టాప్ ట్రెండింగ్ లో ఉంచడానికి ట్వీట్టర్ లో ఉదయం నుండి వివిధ ట్యాగ్స్ ఎమోజీ లతో హంగామా స్టార్ట్ చేశారు. దీంతో ట్విట్టర్ లో సర్కారు వారి పాట సినిమా పేరు టైప్ చేయగానే మహేష్ స్టిల్ తో ఓ ఎమోజీ వస్తుంది. నిజానికి ఇలా ఎమోజీ రావడం ఇదే ఫస్ట్ టైం కాదు. రజినీ కాంత్ సినిమాతో ట్విట్టర్ లో ఈ ఎమోజీ ప్రమోషన్ స్టార్టయింది.

ఇక ఆ తరువాత విజయ్ ‘బీస్ట్’ సినిమాకు అలాగే బ్లాక్ బస్టర్ సినిమా ‘KGF2’ కు కూడా ట్విట్టర్ ఎమోజీ వచ్చింది. అయితే ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకి ఇలా రాలేదు. RRR సినిమాకి రాజమౌళి ఎంతో కష్టపడినా.. దక్కించుకోలేని ఎమోజీని..సర్కారు వారి టీం ఈజీగా దక్కించుకుంది. మహేష్ ఫ్యాన్స్ ‘సర్కారు వారి పాట’ ట్యాగ్ ని ట్విట్టర్ లో ఎప్పటికప్పుడు ట్రెండ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడే ఇలా ఉంటే..ఇక సినిమా రిలీజ్ అయ్యాక పరిస్ధితి ఎలా ఉంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news