Moviesరాంగోపాల్ వ‌ర్మ‌ను చిత‌క్కొట్టింది ఎవ‌రు... ఎక్క‌డ జ‌రిగింది..!

రాంగోపాల్ వ‌ర్మ‌ను చిత‌క్కొట్టింది ఎవ‌రు… ఎక్క‌డ జ‌రిగింది..!

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ తాజాగా మా ఇష్టం సినిమాతో రేపు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఈ సినిమా పోస్ట‌ర్లు, ప్ర‌మోష‌న్లు చూస్తుంటూనే వ‌ర్మ స్టైల్ బికినీ, బ్రాలు గుర్తుకు వస్తున్నాయి. ఇది సినిమాగా కూడా చాలా మంది చూడ‌డం లేదు. వ‌ర్మ గ‌త సినిమాల రిజ‌ల్ట్ చూసి భ‌య‌ప‌డిపోయిన వారు ఇప్పుడు మీ ఇష్టంను సినిమాగా కూడా చూడ‌డం లేదు. రేపు రిలీజ్ అవుతోన్న నాలుగు సినిమాల్లో ఏ మాత్రం బ‌జ్ లేకుండా రిలీజ్ అవుతోన్న సినిమా ఇదే.

ఇక వ‌ర్మ‌పై గ‌త కొద్ది రోజులుగా పోరాటం చేస్తున్నాడు నిర్మాత న‌ట్టి కుమార్‌. వ‌ర్మ త‌న‌కు డ‌బ్బులు ఇవ్వాల‌ని.. ఆ డ‌బ్బులు ఇవ్వ‌కుండా మోసం చేస్తున్నాడంటూ న‌ట్టి కుమార్ కోర్టుకు వెళ్లి మ‌రీ గ‌త నెల‌లో రిలీజ్ కావాల్సిన మా ఇష్టం సినిమాను వాయిదా వేయించాడు. అయితే ఎట్ట‌కేల‌కు అడ్డంకులు దాటుకుని ఈ సినిమా రేపు థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది.

 

సినిమా రిజ‌ల్ట్ ఎలా ? ఉంటుందో కాని.. వ‌ర్మ త‌న ఇద్ద‌రు హీరోయిన్లు అప్స‌రా రాణి, నైనా గంగూలీని వెంటేసుకుని ప్ర‌చారాన్ని అయితే హోరెత్తించేస్తున్నాడు. మ‌రోవైపు న‌ట్టి కుమార్ వ‌ర్మ‌ను టార్గెట్‌గా చేసుకుని వ‌రుస‌గా ఇంట‌ర్వ్యూలు ఇస్తూనే ఉన్నాడు. ఈ ఇంట‌ర్వ్యూల‌కు ఇప్ప‌ట్లో ఫుల్‌స్టాప్ ప‌డేలా లేదు. ఈ క్ర‌మంలోనే న‌ట్టి కుమార్ వ‌ర్మ‌ను గోవాలో డ్రైవ‌ర్లు కొట్టార‌ని కూడా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

వ‌ర్మ ఎవ్వ‌రికి డ‌బ్బులు ఇవ్వ‌డ‌ని.. ఆయ‌నతో ఎవ‌రైనా సినిమాలు చేస్తే చాలా త‌క్కువ ఖ‌ర్చుతో సినిమా చేసి.. ఆ డ‌బ్బులు అన్ని మిగుల్చుకుంటాడ‌ని కూడా చెప్పాడు. ఇక త‌న‌కు ఫ్యామిలీ బంధాలు ఉండ‌వ‌ని.. ఎమోష‌న్లు ఉండ‌వ‌ని పైకి మాత్ర‌మే వ‌ర్మ చెపుతాడ‌ని… కానీ వాస్త‌వంగా వ‌ర్మ త‌న ఫ్యామిలీతోనే క‌లిసి ఉంటాడ‌ని చెప్పాడు.

ఇక వ‌ర్మ మేన‌ల్లుడు ఎప్పుడూ వ‌ర్మ‌తోనే ఉంటూ వ‌ర్మ డ‌బ్బులు అన్నింటిని ఎవ‌రి అక్కౌంట్ల‌లోకి ట్రాన్స్‌ఫ‌ర్ చేయాల‌న్న ప‌నుల్లోనే బిజీగా ఉంటాడ‌ని.. వ‌ర్మ ద‌గ్గ‌ర మొత్తం రు. 1000 కోట్ల‌కు పైగానే ఆస్తులు ఉన్నాయ‌ని బాంబు పేల్చాడు. వ‌ర్మ ఓడ్కా తాగితే ఒక‌రు, మందు తాగితే మ‌రొక‌రు, హోట‌ల్ రెంట్ మ‌రోక‌రు.. ఖ‌ర్చుల‌కు మ‌రొక‌రు డ‌బ్బులు ఇస్తార‌ని.. వ‌ర్మ మాత్రం పైసా ఖ‌ర్చు పెట్ట‌డ‌ని చెప్పారు.

చివ‌ర‌కు గోవాలో వ‌ర్మ కారు డ్రైవ‌ర్ల‌కు కూడా డ‌బ్బులు ఇవ్వ‌క‌పోతే వాళ్లంద‌రూ క‌లిసి ఓ రోజు తెల్ల‌వారు ఝామున వ‌ర్మ‌ను చిత‌క‌బాది రూమ్‌లో ప‌డేశార‌ని కూడా న‌ట్టి చెప్పారు. ఏదేమైనా వ‌ర్మ గురించి మ‌న‌కు తెలియ‌ని కోణాలు న‌ట్టి చాలా బ‌య‌ట పెడుతుండ‌డం సంచ‌ల‌నంగా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news