Moviesపాన్ ఇండియా రౌడీ ... యాక్ష‌న్‌తో ' రామ్ వారియ‌ర్ '...

పాన్ ఇండియా రౌడీ … యాక్ష‌న్‌తో ‘ రామ్ వారియ‌ర్ ‘ టీజ‌ర్ (వీడియో)

ఇస్మార్ట్ శంక‌ర్ సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో యంగ్ ఎన‌ర్జిటిక్ హీరో రామ్ మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చాడు. ఈ క్ర‌మంలోనే లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. కోలీవుడ్ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ అయిన లింగుస్వామి చాలా రోజుల త‌ర్వాత తెలుగు హీరోతో.. అది కూడా పాన్ ఇండియా రేంజ్‌లో సినిమా చేస్తున్నారు. వారియ‌ర్‌గా వ‌స్తోన్న ఈ సినిమా టీజ‌ర్ ఈ రోజు రిలీజ్ అయ్యింది.

సినిమాలో కొన్ని అదిరిపోయే పంచ్ డైలాగులు ఉన్నాయి. పాన్ ఇండియా సినిమాలు చూసి వుంటారు. పాన్ ఇండియా రౌడీలను చూసారా ? వెతుక్కుంటూ వచ్చిన వాడిని కొట్టడం కాదు..వెదుక్కుంటూ వెళ్లి కొట్టడం… గ్యాంగ్ స్టార్స్ వీలైతే మారిపోండి..లేదంటే పారిపోండి అన్న ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ డైలాగులు టీజ‌ర్‌కే హైలెట్ అయ్యాయి.

ఈ డైలాగులు చూస్తేనే సినిమా ఏ రేంజ్ మాస్‌లో ఉండ‌బోతోందో తెలిసిపోతోంది. లింగుస్వామి సినిమాలు అంటేనే మాస్‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. వారియ‌ర్ టీజ‌ర్ అంతా లింగుస్వామి స్టైల్లోనే ఉంది. పోలీస్ ఆఫీస‌ర్ డీఎస్పీ స‌త్య‌గా రామ్ స్టైలీష్ గా క‌నిపించాడు. అత‌డిని ఢీ కొట్టే విల‌న్‌గా ఆది పినిశెట్టి కూడా ప‌వ‌ర్ ఫుల్‌గా ఉన్నాడు. టీజ‌ర్ అంతా యాక్ష‌న్ సీన్లు, విల‌న్‌, హీరో ప‌రిచ‌యంతో అద‌ర గొట్టేసింది.

హీరోయిన్ కృతి గురించి చిన్న ఇంట్ర‌డ‌క్ష‌న్ ఇచ్చి.. సినిమాలో ప్రేమ‌క‌థ‌కు ఇంపార్టెన్స్ ఉంద‌ని చూపించారు. పాన్ ఇండియా లెవల్లో వ‌స్తోన్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. చిట్టూరి శ్రీను నిర్మించే ఈ సినిమాకు సంగీతం దేవీ శ్రీ ప్రసాద్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news