Moviesస‌న్నీలియోన్ దెబ్బ‌తో త‌న పేరు మార్చుకున్న అడ‌వి శేష్‌.. ఇంట్ర‌స్టింగ్ స్టోరీ...!

స‌న్నీలియోన్ దెబ్బ‌తో త‌న పేరు మార్చుకున్న అడ‌వి శేష్‌.. ఇంట్ర‌స్టింగ్ స్టోరీ…!

టాలీవుడ్‌లో ఇప్పుడు టాలెంట్ ఉన్న యువ హీరోలు దూసుకు పోతున్నారు. మంచి క‌థాబ‌లం ఉన్న స‌బ్జెక్టులు ఎంచుకుంటూ హిట్లు కొడుతున్నారు. ఈ కోవ‌లోకే వ‌స్తాడు యంగ్ హీరో అడ‌వి శేష్‌. క్షణం, హిట్ వంటి చిత్రాల ద్వారా విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటాడ‌న్న పేరు అడ‌వి శేష్‌కు వ‌చ్చేసింది. గూఢ‌చారి సినిమా అయితే స్టార్ హీరోల‌కే షాక్ ఇచ్చింది. ఆ సినిమాలో శేష్ న‌ట‌నకు ఫిదా కాని వారు లేరు.

అడ‌వి శేష్ ఎంచుకునే క‌థ‌ల‌కే మ‌నోడికి స‌ప‌రేట్ ఫ్యాన్ ఇమేజ్ క్రియేట్ అయ్యింది. శేష్ తాజాగా మేజ‌ర్ సందీప్ ఉన్ని కృష్ణ‌న్ బ‌యోపిక్ లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. 26 / 11 ముంబై ఉగ్ర‌వాద దాడిలో మ‌ర‌ణించిన మేజ‌ర్ ఉన్ని కృష్ణ‌న్ జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కనుంది.

శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ సినిమాను టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు తొలిసారిగా పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. జూన్ 3న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా హీరో అడ‌వి శేష్ ఆలీతో స‌ర‌దాగా ఓ ప్రోగ్రామ్‌కు హాజ‌ర‌య్యాడు. శేష్ షొలోకి ఎంట్రీ ఇచ్చిన వెంట‌నే ఆలీ అత‌డిని స‌న్నీ చంద్ర అని ప‌ల‌క‌రించాడు.

స‌న్నీ చంద్ర అంటే అడ‌వి శేష్ అస‌లు పేరు. మ‌రి ఈ పేరు ఎందుకు మారిపోయిందో శేష్ స్వ‌యంగా చెప్పాడు. కాలేజ్ రోజుల్లో స‌న్నీలియోన్ పేరు బాగా ఫేమ‌స్ అట‌. అప్ప‌టికే ఆమె పాపుల‌ర్ పోర్న్ స్టార్‌. ఆ టైంలో అడ‌వి శేష్ పేరు స‌న్నీ చంద్ర కావ‌డంతో అంద‌రూ స‌ర‌దాగా సన్నీ లియోన్ అని పిలిచేవారట.

అప్పుడే అడ‌వి శేష్ త‌న పేరు మార్చుకోవాల‌ని డిసైడ్ అయిపోయార‌ట‌. ఇక సినిమాల్లోకి వ‌చ్చి క్రేజీ హీరో అయ్యాక తన పేరును అడివి శేష్‌గా మార్చుకున్నాడు. అది అడ‌వి శేష్ అస‌లు పేరు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news