Movies' స‌ర్కారు వారి పాట ' గోల్డెన్‌ఛాన్స్ మ‌హేష్ మిస్ అవుతున్నాడా...!

‘ స‌ర్కారు వారి పాట ‘ గోల్డెన్‌ఛాన్స్ మ‌హేష్ మిస్ అవుతున్నాడా…!

సూప‌ర్‌స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట ట్రైల‌ర్ వ‌చ్చేసింది. డ‌బుల్ మీనింగ్ డైలాగుల‌తో పాటు కీర్తి – మ‌హేష్ మ‌ధ్య రొమాన్స్‌, ల‌వ్ సీన్లు, యాక్ష‌న్ ఇవ‌న్నీ చూస్తుంటే సినిమాకు మాంచి హిట్ క‌ళ అయితే క‌నిపిస్తోంది. ట్రైల‌ర్ అయితే సోష‌ల్ మీడియాను షేక్ చేస్తూ ఓ ఊపు ఊపుతోంది. ఇక టాలీవుడ్‌లో ఇప్పుడు ఉన్న ప‌రిస్థితులు చూస్తుంటే కూడా స‌ర్కారు కు కాలం క‌లిసి వ‌చ్చేలా ఉంది. అయితే ఈ గోల్డెన్ ఛాన్స్‌ను మ‌హేష్ మిస్ చేసుకుంటున్నాడా ? అన్న సందేహాలు కూడా ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి.

టాలీవుడ్‌లో ఇప్పుడు సినీ ల‌వ‌ర్స్ మంచి సినిమా వ‌స్తే బ్లాక్‌బ‌స్ట‌ర్ చేసి ప‌డేసేందుకు మాంచి ఆక‌లి మీద ఉన్నారు. త్రిబుల్ ఆర్ ఒక్క‌టే కాస్త ఆక‌లి తీర్చినా.. కేజీయ‌ఫ్ 2 మ‌న సినిమా కాదు. పెద్ద హీరో న‌టించిన ఎంట‌ర్టైన్‌మెంట్ సినిమా వ‌చ్చి చాలా రోజులు అవుతోంది. అఖండ‌, పుష్ప త‌ర్వాత ఆ రేంజ్‌లో పెద్ద సినిమా ( త్రిబుల్ ఆర్ మిన‌హాయింపు) రాలేదు. పైగా మహేష్ బాబు సినిమా విడుదలై రెండేళ్లు దాటిపోయింది.

త్రిబుల్ ఆర్‌, కేజీయఫ్‌ల్లో ఎంట‌ర్టైన్‌మెంట్ నిల్‌. మ‌హేష్ ఫ్యాన్స్ అయితే మాంచి ఆక‌లి మీద ఉన్నారు. సినిమా బాగుందిరా అన్న టాక్ వస్తే చాలు క‌సితో రెండు, మూడు సార్లు చూసి హిట్ చేసి ప‌డేసేందుకు కాచుకునే ఉన్నారు. ట్రైల‌ర్లో మ‌హేష్‌బాబు క‌ల‌ర్ ఫుల్ లుక్స్ కూడా సినిమాపై అంచ‌నాలు ఎక్క‌డికో తీసుకుపోయాయి. ఫ్యాన్స్‌కు మాత్ర‌మే కాకుండా.. యూత్‌కు, స్టూడెంట్స్‌కు, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కూడా ట్రైల‌ర్ బాగా క‌నెక్ట్ అవుతోంది.

ఆచార్య‌ను ఎంజాయ్ చేసేందుకు మ‌నోళ్లు సిద్ధంగానే ఉన్నా తొలి రోజుకే డిజాస్ట‌ర్ టాక్ రావ‌డంతో అస‌లు ఆ సినిమా ఆడుతుంద‌న్న విష‌య‌మే మ‌ర్చిపోయారు. కాస్త కంటెంట్ ఉంటేచాలు స‌ర్కారు వారి పాట ఓ రేంజ్‌లో హిట్ అవుతుంద‌నే అంచ‌నా వేస్తున్నాయి ట్రేడ్ వ‌ర్గాలు. అయితే ఇక్క‌డే ఓ లోపం కూడా ఉంది. ఆచార్య‌, కేజీయ‌ఫ్ 2, త్రిబుల్ ఆర్ లాంటి పెద్ద సినిమాల‌కు ఆయా హీరోలు, సినిమా యూనిట్ క‌నీసం రెండు వారాల ముందు నుంచే ప్ర‌మోష‌న్లు చేస్తూ సినిమాను జ‌నాల్లోకి తీసుకుపోయేందుకు త‌మ వంతుగా క‌ష్ట‌ప‌డ్డారు.

స‌ర్కారు వారి పాట రిలీజ్ అయ్యేందుకు మ‌రో ఏడు రోజులు మాత్ర‌మే గ్యాప్ ఉంది. మ‌హేష్ ఫ్యామిలీతో విదేశీ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు. మ‌హేష్ ఎప్పుడు ఇండియాకు తిరిగి వ‌స్తాడు ? ఎప్పుడు ప్ర‌మోష‌న్లు స్టార్ట్ చేస్తాడు ? అన్న టెన్ష‌న్ అయితే ఫ్యాన్స్‌లో ఉంది. ఓ వైపు ప‌ర‌శురాం ఒక్క‌డే సింగిల్‌గా ప్ర‌మోష‌న్లు చేసుకుంటూ ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నాడు. అదే సినిమాకు ముందు మ‌హేష్ ప్ర‌మోష‌న్లు ప‌డితే ఆ హైప్‌, ఓపెనింగ్స్ మామూలుగా ఉండ‌వు.. కానీ మ‌హేష్ ఎందుకు ఇంత లైట్‌గా ఉంటున్నాడ‌న్న‌దే ఎవ్వ‌రికి అంతు ప‌ట్ట‌డం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news