Moviesరామ్‌చరణ్-శంకర్ సినిమా.. కేకపుట్టించే అప్డేట్ వచ్చేసిందోచ్..

రామ్‌చరణ్-శంకర్ సినిమా.. కేకపుట్టించే అప్డేట్ వచ్చేసిందోచ్..

రామ్‌చరణ్ రీసెంట్ గా నటించిన ఆచార్య బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో మెగా ఫ్యాన్స్ కొంత నిరాశ పడుతున్నారు. ఎన్నో భారీ అంచనాలు పెట్టుకున్న సినిమా ఫ్లాప్ అయ్యిందే అంటూ బాధపడుతున్నారు. అలాంటి ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే అప్డేట్ ఇవ్వడానికి రెడీ అవుతుంది ఋఛ్15 టీం. మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ ..తెలుగు అమ్మాయి అంజలి హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమా ని నిర్మిస్తున్నారు.

శంకర్ స్టైల్ లోనే.. ఈ సినిమా కూడా అవినీతి నేపథ్యంలో తెరకెక్కుతోందని ఇప్పతికే ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఇప్పటికి కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. దాదాపు 60శాతం సినిమా కంప్లీట్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. రాంచరణ్ ఈ చిత్రంలో సివిల్ సర్వీస్ అధికారిగా నటిస్తున్నాడు అని ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. రాంచరణ్ ఈ చిత్రంలో మూడు విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తున్నాడు. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో క‌న్న‌డ యాక్ట‌ర్‌ జ‌య‌రామ్, టాలీవుడ్ యాక్ట‌ర్ న‌వీన్ చంద్ర ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఈ చిత్రానికి ఆసక్తికర టైటిల్ వినిపిస్తోంది. అందుతున్న సమాచారం మేరకు చిత్ర యూనిట్ ‘సర్కారోడు’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు చెబుతున్నారు. అయితే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి హీరోయిన్ ఫస్ట్ లుక్ రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నతిస్తున్న కీయర అద్వాని కి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీ చేయనున్నారట మేకర్స్. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు సంబంధించి అస్సలు అప్డేట్స్ ఇవ్వడమే మానేశారు. ఎప్పుడో పూజా కార్య క్రమాలప్పుడు ఇచ్చిన అప్డేట్ నే.. ఇప్పటి వరకు ఏం లేదు. సినిమాకి కి మంచి బజ్ ఏర్పడడానికి ఇలా ప్లాన్ చేశార్ట శంకర్. మరి చూడాలి ఈ ప్లాన్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో..?

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news