Movies' స‌ర్కారు వారి పాట‌ ' కు బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్‌... దూకుడును...

‘ స‌ర్కారు వారి పాట‌ ‘ కు బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్‌… దూకుడును మించిన హిట్ (వీడియో)

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు వ‌రుస హిట్ల‌తో బిజీగా ఉన్నాడు. భ‌ర‌త్ అనే నేను – మ‌హ‌ర్షి – స‌రిలేరు నీకెవ్వ‌రు ఇలా వ‌రుస హిట్ల‌తో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. మ‌హేష్ గ‌త సినిమాలు చూస్తే లైన‌ప్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటోంది. అంత‌కుముందు బ్ర‌హ్మోత్స‌వం, స్పైడ‌ర్ ప్లాపుల‌తో క‌థ‌లు, డైరెక్ట‌ర్ల విష‌యంలో ఎక్క‌డా రాజీప‌డ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే గీత గోవిందం లాంటి సూప‌ర్ హిట్ తెర‌కెక్కించిన ప‌ర‌శురాం పెట్ల‌తో స‌ర్కారు వారి పాట ఆడేందుకు రెడీ అయ్యాడు.

ప‌ర‌శురాం కూడా గీత గోవిందం త‌ర్వాత ఎక్క‌డా దూకుడుగా వెళ్ల‌కుండా వెయిట్ చేసి మ‌రీ మ‌హేష్ సినిమా చేస్తున్నాడు. మ‌హేష్ అంటేనే అటు క్లాస్ ఆడియెన్స్‌.. ఇటు మాస్ అడియెన్స్ ఇద్ద‌రిని మెప్పించాలి. మ‌హేష్ సినిమాలో చిన్న చిన్న పంచ్‌లు, ఫ‌న్‌, యాక్ష‌న్ ఉండాలి. ఇవ‌న్నీ బ్యాలెన్స్ చేస్తూనే స‌ర్కారు వారి పాట సినిమా తెర‌కెక్కిన‌ట్టు తెలుస్తోంది. తాజాగా రిలీజ్ అయిన ట్రైల‌ర్ యూట్యూబ్‌లో సెన్షేష‌న్ క్రియేట్ చేస్తూ దూసుకు పోతోంది.

ట్రైల‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చాక ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో సినిమాకు బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్ అయితే వినిపిస్తోంది. సినిమా ఫ‌స్టాఫ్ అంతా కావాల్సినంత కామెడీతో పాటు హీరోయిన్ కీర్తి, మ‌హేష్ మ‌ధ్య అదిరిపోయే ల‌వ్‌ట్రాక్‌, రొమాంటిక్ సీన్లు.. మ‌హేష్ చేసే కామెడీ ట్రాక్‌, జోకులు, అదిరిపోయే ఫ‌న్‌తో సినిమా న‌డుస్తుంద‌ని అంటున్నారు. ఇంట‌ర్వెల్‌కు ముందు బ్యాంకు కుంభ‌కోణం గురించి హీరో ఇచ్చే రిటాక్ట్‌తో విల‌న్ బ‌య‌ట‌కు వ‌స్తాడ‌ట‌.

 

 

సెకండాఫ్‌లో ఫ్యామిలీ సెంటిమెంట్‌తో పాటు విల‌న్ల భ‌ర‌తం ఎలా ప‌ట్టాడు ? అన్న క‌థాంశంతో స‌ర్కారు వారి పాట సినిమా న‌డుస్తుంద‌ని అంటున్నారు. ఇక వెన్నెల కిషోర్ – మ‌హేష్ ట్రాక్ కూడా ఫ్యాన్స్‌కు మాంచి కిక్ ఇచ్చేలా ఉంది. ఫస్టాఫ్‌లో హీరో – హీరోయిన్ల మ‌ధ్య వ‌చ్చే ల‌వ్ ట్రాక్‌… కీర్తి సురేష్‌… మ‌హేష్‌ను పిచ్చ‌పిచ్చ‌గా వాడేయ‌డం ఇవ‌న్నీ చూస్తుంటే థియేట‌ర్లో కేక‌లే కేక‌లు అంటున్నారు.

ఇక హీరోయిన్‌ను ప‌డ‌గొట్టే క్ర‌మంలో నేను విన్నాను.. నేను ఉన్నాను అన్న డైలాగ్ కూడా సోష‌ల్ మీడియాలో బాగా హ‌డావిడి చేస్తోంది. థ‌మ‌న్ మాట‌లు అల రేంజ్‌లో వైర‌ల్ అవుతున్నాయి. ట్రైల‌ర్‌లో నేప‌థ్య సంగీతం చూస్తుంటేనే మ‌రోసారి అఖండ రేంజ్‌ను గుర్తుకు తెచ్చేలా ఉంది. ఓవ‌రాల్‌గా మ‌హేష్‌కు దూకుడును మించిన రేంజ్ హిట్ స‌ర్కారు వారి పాట రూపంలో ద‌క్క‌బోతోంద‌న్న టాక్ అయితే బ‌లంగా వ‌చ్చేసింది. మ‌రి సినిమా ఏం చేస్తుందో ఈ నెల 12న తేలిపోనుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news