Moviesఅమ్మ బాబోయ్..బిత్తిరి సత్తి నెల ఆదాయం అన్ని లక్షలా..?

అమ్మ బాబోయ్..బిత్తిరి సత్తి నెల ఆదాయం అన్ని లక్షలా..?

బిత్తిరి సత్తి..ఈ పేరు కు ప్రత్యేక పరిచయం అవద్సరం లేదు. తనదైన స్టైల్ లో మాట్లాడుతూ..మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన టీవీ కమెడియన్ ఎవరూ అంటే అందరు టక్కున చెప్పే పేరే ఈ అది బిత్తిరి సత్తి . తన కెరీర్ ని వి6 ఛానల్ లో ‘తీన్మార్ వార్తలు’ అనే కార్యక్రమం ద్వారా ప్రారంభించిన ఈయన..ఆ షో ద్వార చాలా పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా ఆయన మాట్లాడే పద్ధతి..చాలా అమందిని ఎంటర్ టైన్ చేస్తుంది. డిఫరెంట్ గెటప్ తో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా కొత్తగా విడుదలైన సినిమాలపై, రాజకీయ పరిణామాలపై, ఇతర సంగతులపై సత్తి చేసే పేరడీలకు మంచి స్పందన వచ్చింది.

అయితే, బిత్తిరి సత్తి కి ఫ్యాన్స్ పెరిగారు..బాగా పాపులర్ అయ్యాడు. దీంతో ఆయన పాపులారిటీని కొన్ని ఛానల్స్ క్యాచ్ చేసుకుని..ఎక్కువ జీతం ఆఫర్ చేసాయి. ఇక అన్నీంటీలోకు మంచి ఆఫర్ అనిపించిన..TV9 ఛానల్ ని చూస్ చేసుకున్నాడు. వ్6 ఛానల్‌లో వేల జీతానికి పనిచేసే బిత్తిరిసత్తికి లకారాల ఆఫర్ రావడంతో తీన్మార్ వార్తల నుంచి జంప్ కొట్టి టీవీ 9లో ఇస్మార్ట్ వార్తలు మొదలుపెట్టారు. అక్కడ కొన్నాళ్లు చేసాక.. టీవీ 9 ఇస్మార్ట్ వార్తలకు దూరమైన విషయం తెలిసిందే. అయితే ఆయనే రాజీనామా చేసి బయటకు వచ్చేశారని కొందరు అంటుంటే.. యాజమాన్యం తీసేసిందని మరికొందరు చెప్పుకొచ్చారు. ఫైనల్లీ ఇప్పుడు సాక్షీ టీవీలో వర్క్ చేస్తున్నాడు.

కాగా, ఇంత పాపులారిటీ, ఫ్యాన్ బేస్ ఉన్న బిత్తిరి సత్తి ఆదాయాం ఎంత అని..సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ టాప్ యాంకర్ల రెమ్యునరేషన్లతో పోల్చి చూస్తే బిత్తిరి సత్తి రెమ్యునరేషన్ ఎక్కువ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మహేష్ బాబును, వెంకటేష్ వరుణ్ తేజ్ లను ఇంటర్వ్యూ చేయడం ద్వారా బిత్తిరిసత్తి మళ్ళీ ఫాంలోకి వచ్చాడు అంటున్నారు జనాభ. సినిమాలను ప్రమోట్ చేస్తూ బిత్తిరి సత్తి క్రేజ్ ను పెంచుకుంటున్నారట.

ఈయన ఒక ఇంటర్వ్యూ చేస్తే సుమారు రెండు లక్షల రూపాయలు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక బిత్తిరి సత్తి మీడియా న్యూస్ ఛానల్ లో డిమాండ్ను బట్టి మారుతూ వస్తున్నాడట. ప్రస్తుతం నెలకు 5 నుంచి 7 లక్షల రూపాయల వరకు ఆదాయాన్ని అందుకుంటున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. సుమ కంటే ఎక్కువ ఆదాయం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. బిత్తిరి సత్తికి సినిమా ఆఫర్లు కూడా వస్తుండగా సినిమా ఆఫర్ల విషయంలో బిత్తిరి సత్తి ఆచితూచి వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news