Moviesఆ బ్యూటీ పేరు చెప్పితేనే మండిపడుతున్న బాలయ్య ఫ్యాన్స్..ఎందుకంటే..?

ఆ బ్యూటీ పేరు చెప్పితేనే మండిపడుతున్న బాలయ్య ఫ్యాన్స్..ఎందుకంటే..?

సింహం ..ఎక్కడున్న సిం హమే ..అది బోన్ లో ఉన్నా..బయట ఉన్నా..దాని వాల్యూ మారదు..విలువ తగ్గిపోదు. బాలయ్య కూడా అంతే ..యంగ్ గా ఉన్నా..సీనియర్ అయిన..నటనలో ఆ గ్రెస్..డ్యాన్సింగ్ స్టైల్..డైలాగ్ పవర్..ఏం తగ్గవు. ప్రస్తుతం బాలయ్య మంచి ఫాంలో ఉన్నారు. అస్సలు ఏమాత్రం తగ్గడం లేదు సరికదా యంగ్ హీరోలకు గట్టి పోటీ కూడా ఇచ్చేస్తూ సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. రీసెంట్ గా అఖండ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన..ప్రజెంట్ డైనమిక్ డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో NBK 107 వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాలో ఆయన మనల్ని డ్యూయెల్ రోల్ లో మెప్పించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కేకపుట్టిస్తుంది. ఇక సినిమా రిలీజ్ అయితే..చరిత్ర తిరగ రాస్తుంది అనడంలో సందేహం లేదు. ఈ సినిమాలో బాలయ్య కు జోడీగా స్టార్ డాటర్ శృతి హాసన్ నటిస్తుంది. దీని కోసం ఆమె ఏకంగా ఏడు కేజీల బరువు పెరుగుతుందట. ఇక ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే బాలయ్య..అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు.

ఈ త‌రం జ‌న‌రేష‌న్ ద‌ర్శ‌కుల్లో అనిల్ రావిపూడి కామెడీని పండించ‌డంలో త‌న‌కు తానే ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు. త‌న‌దైన మార్క్ కామెడీ, పంచ్‌లు ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటున్నాయి. అందుకే అనిల్ ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన అన్ని సినిమాలు మంచి హిట్ కొట్టాయి. కాగా, ఇప్పుడు బాలయ్య తో మాత్రం ఆయన తన ఫార్ములా ని మార్చుకుని..యాక్షన్ సినిమా తెరకెక్కించాలని చూస్తున్నాడు.

కాగా, ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు మెహ్రీన్ అనుకున్నా..కానీ, ఇప్పుడు ఆమెను సెకండ్ హీరోయిన్ చేస్తూ..ఫస్ట్ హీరోయిన్ గా నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి ని తీసుకునే ఆలోచనలో ఉన్నారట. అయితే, బాలయ్య-ప్రియమణి కాంబో వచ్చిన మిత్రుడు సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ సెంటిమెంట్ తో బాలయ్య ఫ్యాన్స్ ఆమె పేరు చెప్పితేనే మండిపడుతున్నారు. బాలయ్య కి జోడీగా నయన్ దింపితే బాగుంటుందని సజీషన్స్ ఇస్తున్నారు. మరి అనీల్ ఏం చేస్తాడో చూడాలి..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news