Moviesబాలయ్యతో సినిమా అదిరిపోద్ది.. అనిల్ హింట్ ఇచ్చేసాడురోయ్..!!

బాలయ్యతో సినిమా అదిరిపోద్ది.. అనిల్ హింట్ ఇచ్చేసాడురోయ్..!!

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా మారిపోతుందో ఎవ్వరు చెప్పలేం. అలా ఇండస్ట్రీలోకి అనుకోకుండా డైరెక్టర్ గా ఎంటర్ అయ్యి ..ఇప్పుడు బడా స్టార్స్ తో సినిమా లు చేసే స్దాయికి ఎదిగిపోయాడు అనిల్ రావిపూడి . మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు అంటూ పవర్ ఫుల్ బ్లాక్ బస్టర్ అందుకున్న ఆయన ఆ తరువాత చాలా టైం గ్యాప్ తీసుకుని.. F3 సినిమా తెరకెక్కించారు. గతం లో ఈయన డైరెక్ట్ చేసిన F2 సినిమా కి ఇది సీక్వెల్. ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద ఎంతటి ఘన విజయం అందుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక అంతకు మించి అన్న రేంజ్ లో F3 సినిమా ను తెరకెక్కించారట అనిల్.

ఈ మధ్యనే ట్రైలర్ రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఫుల్ కామెడీ తో..వరుణ్, వెంకటేష్ తమ స్టైల్ లో ఇరగదీశారు. ఇక హీరోయిన్స్ గా నటించిన తమన్నా, మెహ్రీన్ అయితే..చించేసారు. ట్రైలర్ తోనే సినిమా పై ఓ రేంజ్ లో ఎక్స్ పెక్ట్ చేసేలా చేసుకున్నాడు అనిల్ రావిపూడి . కాగా, ఈ సినిమా ను మే 27న గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు F3 Team. ఇందులో భాగంగానే డైరెక్టర్ అనిల్ రావిపూడి , కమెడియన్ సునిల్..ఆలీతో సరదాగా గేమ్ షో కి వచ్చారు.

ఈ షోలో ఆలీ, అనిల్, సునీల్..ఫుల్ కామెడీ తో నవ్వులు పూయించారు. ఇక ఈ క్రమంలోనే అలీ ..అనీల్ తో ..”నువ్వు ఎప్పుడు కామెడీ సినిమాలే నా..ఇక యాక్షన్ జోలికి వెళ్లవా..” అంటూ ప్రశ్నించగా ..అనిల్ రిప్లై ఇస్తు..” అలాంటిది ఏం లేదు. నెక్స్ట్ ఉంది గా అంటూ బాలయ్య మ్యానరిజాన్ని ఇమిటేట్ చేస్తూ ఆయన సినిమాలో…మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని..హింట్ ఇచ్చేశాడు. బాలయ్య స్టైల్ లో అవన్నీ అదిరిపోతాయ్ అంటూ అనిల్ రావిపూడి చెప్పకనే చెప్పేశాడు. దీంతో బాలయ్యతో అనిల్ సినిమా పై అభిమానులు ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి చూడాలి సినిమా ని ఏ విధంగా తెరకెక్కిస్తాడో అనిల్ ..

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news