MoviesNTR31: ఎన్టీఆర్ సినిమాలో స్టార్ హీరో వైఫ్.. ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా..?

NTR31: ఎన్టీఆర్ సినిమాలో స్టార్ హీరో వైఫ్.. ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా..?

ఎన్టీఆర్ .. టాలీవుడ్ టాప్ హీరోలల్లో ఒకరు కొనసాగుతున్న నందమూరి నటవారసుడు. రీసెంట్ గానే RRR సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ఈయన ..ప్రజెంట్ RRR సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. మనకు తెలిసిందే.. RRR లో తరక్ అన్నా కూడా చరణ్ హైలెట్ అయ్యారని.. తారక్ కు స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉందని.. రాజమౌళి తారక్ కి అన్యాయం చేశాడని..ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. కానీ తనకు ఇచ్చిన పాత్రకి తారక్ 200% న్యాయం చేశాడు. ముఖ్యంగా కొమరం భీముడో సాంగ్ లో తారక్ ఎక్స్ ప్రేషన్స్ సూపర్.

ఆ పాట చూసిన ప్రతి ఒక్కరు..చిన్న-పెద్ద కంటతది పెట్టుకున్నారు అంత ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యింది ఆ పాట. దీంతో సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. కాగా, మరి కొద్ది రోజుల్లోనే తారక్ కొరతాల తో కమిట్ అయిన సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఈ సినిమా లో తారక్ ఢిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడని సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా ఫినిష్ చేసి..తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కమిట్ అయిన సినిమాని తెరకెక్కించబోతున్నారట.

కాగా, రీసెంట్ గా ఎన్టీఆర్ 31 గురించిన క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది. అదేంటంటే.. నిన్న మొన్నటి వరకు ఈ సినిమాలో హీరోయిన్ గా స్టార్ డాటర్ జాన్వీ కపుర్ అని అనుకోగా..ఇప్పుడు అనుకోకుండా అనూహ్యంగా ఈ సినిమాలో తారక్ కు జోడిగా స్టార్ భార్య నటిస్తుంది అనే వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఈ మేరకు ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనేను ఫైనల్ చేశారని ఫేమస్ సినీ క్రిటిక్ ఉమైర్ సింధు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ న్యూస్ వైరల్ అయింది.

ఎన్టీఆర్‌తో దీపిక పదుకొనే రొమాన్స్ చేయనుందనే విషయం బయటకి రాగానే వాళ్ళ మధ్య హైట్ ప్రాబ్లమ్ రావొచ్చు అంటూ ఫ్యాన్స్ కామెంట్ల మోత మోగిస్తున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యుల్లో ఎన్టీఆర్‌ తో సినిమా చేయలని ఉంది అని చెప్పిన దీపిక..కు ప్రశాంత్ ఇలా ఆఫర్ ఇచ్చాడు.. కానీ తారక్ పక్కన జాన్వీ నే బ్నాగుంటుంది..అంటూ నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు. మరి ఈ విషయంలో ప్రశాంత్ ఎలాంటి డెసీషన్ తీసుకుంటాడో చూడాలి..!

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news