Moviesమెహ్రీన్ కి ఆ దోమ కుట్టిందా..అయ్య బాబోయ్..కష్టమే..?

మెహ్రీన్ కి ఆ దోమ కుట్టిందా..అయ్య బాబోయ్..కష్టమే..?

మెహ్రీన్..ఈ పంజాబీ ముద్దుగుమ్మ గురించి .. అమ్మడు అందాలు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మొదట్లో బొద్దుగా ఉన్న్నా ఆ తరువాత సన్న పడి హాట్ గా తయారైంది. చూసేందుకు చక్కటి రూపం..చూడాగానే అట్రాక్ట్ చేసే నవ్వు..అంతకు మించి ఫిజిక్ తో కుర్రకారుని అల్లాడిస్తుంది. అబ్బో..అమ్మడుకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. కెరీర్ లో పెద్దగా చెప్పుతగిన హిట్స్ లేకపోయినా..స్టార్స్ సినిమాలో అవకాశం కొట్టేస్తూ..బిజీ బిజీ గా ఉంది.

ఇక మొదటి సినిమా కృష్ణగాడి వీరప్రేమ గాధ తో వెండితెరకు పరిచయమైన నటి మెహ్రీన్ ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయారు. సినిమా హిట్టా..ఫట్టా అని ఆలోచించకుండా..వరుసగా సినిమాలు చేస్తూ వెళ్లింది.మనకు తెలిసిందే ఈ అందాల తార గ్రాండ్‌గా భవ్య భిష్ణోయ్‌తో నిశ్చితార్థం జరుపుకుని..ఏవో కారణాల చేత ఆ బంఫ్హాని తెంపుకుంది. అందరు ఇక మెహ్రీన పెళ్లి వేడుకే అని అనుకున్నారు. కానీ అంతలోపే మెహ్రీన్ షాక్ ఇచ్చారు. భవ్య భిష్ణోయ్‌తో జరిగిన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు. జరిగిన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నామని, ఇకపై ఇంతటితోనే తమ బంధం ముగిసిందని పెళ్లి పెటాకులైనట్టు ప్రకటించేశారు మెహ్రీన్.

ఇక ఆ తరువాత అమ్మడు పెళ్లి బంధం ఇలా తెగిపోవడంతో రకరకాల వార్తలు వచ్చాయి.కానీ, మెహ్రీన్ ఏం పట్టించుకోలేదు. తనపని తాను చూసుకుంటూ వెళ్లిపోయింది. అయితే తాజాగా అమ్మడుకి మళ్ళీ ప్రేమ అనే దోమ కుట్టిందట. టాలీవుడ్ యంగ్ హీరోతో ఈ పంజాబీ పాప ప్రేమాయణం నడుపుతుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. అమ్మడు ఆ కుర్ర హీరోతో ఓ సినిమా కూడా చేసిందట. ఆ టైంలో బాగా క్లోజ్ అయిన ఈ జంట..ఇప్పుడు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ ఇండస్ట్రీలో ఓ వార్త వైరల్ గా మారింది. మరి ఈసారి అయిన మెహ్రీన్ పెళ్లి చేసుకుంటుందా.. లేక మధ్యలోనే వదిలేస్తుందా అంటున్నారు నెటిజన్లు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news