Movies' జ‌యం ' సినిమా పోస్ట‌ర్ చూసి నితిన్‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ తీసిన...

‘ జ‌యం ‘ సినిమా పోస్ట‌ర్ చూసి నితిన్‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ తీసిన స్టార్ డైరెక్ట‌ర్‌…!

నితిన్‌.. ఇన్నేళ్లుగా ఇండ‌స్ట్రీలో కొన‌న‌సాగుతూ వ‌స్తున్నాడు. నితిన్ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి 20 ఏళ్లు అయ్యింది. నితిన్ కెరీర్‌లో ఎన్నో ఎత్తుప‌ల్లాలు చూశాడు. 2002లో వ‌చ్చిన జ‌యం సినిమాతో నితిన్ వెండితెర‌కు హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. తేజ ఈ సినిమా ద‌ర్శ‌కుడు. స‌దా హీరోయిన్‌. అప్ప‌ట్లో యువ‌త‌ను జ‌యం ఊపేసింది. ఈ సినిమాలో పిరికి హీరో అయిన నితిన్‌ను స‌దా వెళ్ల‌వ‌య్యా వెళ్లు అంటూ చెప్పే డైలాగ్‌ను అప్ప‌ట్లో అమ్మాయిలు అబ్బాయిల‌ను టీజ్ చేయ‌డానికి బాగా వాడుకునేవారు.

ఈ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టిన టైంలో ఓ రోజు దిల్ రాజు – వినాయ‌క్ కారులో వెళుతున్నార‌ట‌. అప్ప‌టికే వినాయ‌క్ ఎన్టీఆర్‌తో ఆది సినిమా చేసి బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టేశాడు. బాల‌య్య‌తో చెన్న‌కేశ‌వ‌రెడ్డి చేస్తున్నాడు. వినాయ‌క్‌కు ఆదితోనే టాప్ డైరెక్ట‌ర్ పేరు వ‌చ్చేసింది. దిల్ రాజు అప్ప‌టికే నైజాంలో సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తూ నైజాం రాజుగా పేరు తెచ్చుకున్నాడు.

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ స్థాపించి సినిమా నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇవ్వాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. త‌న బ్యాన‌ర్లో తొలి సినిమాకు వినాయ‌క్‌ను డైరెక్ట‌ర్‌గా అనుకున్నారు. ఈ సినిమాకు వినాయ‌క్ వ‌ద్ద సుకుమార్‌, వేమారెడ్డి అసిస్టెంట్ డైరెక్ట‌ర్లుగా ఉన్నారు. చ‌ర్చ‌ల త‌ర్వాత క‌థ‌లో మార్పులు చేసి ఓకే చేశారు. వైజాగ్‌లో సిట్టింగ్‌లు వేశారు. రాజు చెప్పిన సింగిల్ లైన్ వ‌ర్డ్స్‌ను కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నారు.

ఇక హీరోగా ఎవరిని తీసుకోవాల‌నుకున్న‌ప్పుడు కారులో వెళుతుండ‌గా విన‌య్ జ‌యం పోస్ట‌ర్ చూసి అన్నా ఈ కుర్రాడెవ‌రో కాని బాగున్నాడు.. మ‌న సినిమాకు సెట్ అవుతాడ‌ని అన్నార‌ట‌. వెంట‌నే రాజు మా డిస్ట్రిబ్యూట‌ర్ సుధాక‌ర్ రెడ్డి గార‌బ్బాయ్‌.. అని నితిన్‌తో పాటు తండ్రిని పిలిపించి క‌థ చెప్పించార‌ట‌. వెంట‌నే వాళ్ల‌కు క‌థ న‌చ్చ‌డంతో సినిమా ఓకే అయిపోయింది.

దిల్ రాజు బ్యాన‌ర్లో అదే తొలి సినిమా. 2003 స‌మ్మ‌ర్ కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సూప‌ర్ హిట్ అయిపోయింది. ఈ సినిమా త‌ర్వాత నితిన్‌కు మాస్‌లో తిరుగులేని ఫాలోయింగ్ వ‌చ్చింది. ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన సుకుమార్ వ‌ర్క్‌, ఆయ‌న చెప్పిన క‌థ న‌చ్చ‌డంతోనే వెంట‌నే త‌న బ్యాన‌ర్లో ఆర్య‌కు ఛాన్స్ ఇచ్చాడు దిల్ రాజు.

ఇక ఈ సినిమాకు దిల్ టైటిల్ పెట్ట‌డం కూడా విచిత్రంగానే జ‌రిగింది. అప్ప‌టికే ఈ టైటిల్ మ‌రో నిర్మాత బూరుగుప‌ల్లి శివ‌రామ‌కృష్ణ రిజిస్ట‌ర్ చేసుకున్నారు. దిల్ రాజు వెళ్లి అడిగిన వెంట‌నే ఆయ‌న ఇచ్చేశారు. చివ‌ర‌కు ఆ పేరే దిల్ రాజుకు ముందు యాడ్ అయ్యి అదే శాశ్వ‌తం అయిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news