Moviesటాలీవుడ్ కుర్రకారును ఊపేసిన రక్షితకు ఏమైంది.... ఎందుకు ఇలా మారిపోయింది ...?

టాలీవుడ్ కుర్రకారును ఊపేసిన రక్షితకు ఏమైంది…. ఎందుకు ఇలా మారిపోయింది …?

రక్షిత రెండు దశాబ్దాల క్రితం టాలీవుడ్ కుర్రకారును ఒక ఊపు ఊపేసింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇడియ‌ట్ సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయం అయ్యింది. రక్షిత కన్నడ అమ్మాయి. కన్నడంలో సినిమాలు చేస్తున్న క్రమంలో ఆమె పూరిజగన్నాథ్ కంట్లో పడింది. అప్పుడు పూరి జగన్నాథ్ రవితేజతో ఇడియట్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు.

ఈ సినిమాలో హీరోయిన్ కోసం వెతుకుతుండగా రక్షిత ఫేస్ వాల్యూతో పాటు ఆమె స్ట్ర‌క్ష‌ర్‌తో పూరి జగన్నాథ్ కు పిచ్చెక్కి పోయింది. ఈ క్రమంలోనే రవితేజకు జోడీగా హీరోయిన్ గా ఎంపిక చేశాడు. ఈ సినిమాలో రక్షిత యాక్టింగ్ తో పాటు… ఆమె బ్యాక్ స్ట్రక్చర్ చూసి తెలుగు కుర్రకారు ఆమె మాయలో పడిపోయారు. 2002లో వచ్చిన ఇడియట్ సూపర్ డూపర్ హిట్ అయింది. సుచిగా ఆమె క్యారెక్ట‌ర్ ఇక్క‌డోళ్ల‌కు బాగా న‌చ్చేసింది.

ఆ తర్వాత కొన్ని అవకాశాలు వచ్చినా తెలుగులో అనుకున్న రేంజ్ లో రక్షిత పాపులర్ కాలేదు. ఎస్వీ. కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన పెళ్లాం ఊరెళితే సినిమాలో హీరో వేణుకు జోడిగా నటించింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి పక్కన అందరివాడు సినిమాలో కూడా నటించింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పూరి జగన్నాథ్ తీసిన ఆంధ్రావాలా సినిమాలో కూడా నటించింది. నాగార్జునతో శివమణి, మ‌హేష్‌బాబుతో తేజ చేసిన నిజం సినిమాలు కూడా చేసింది.

పూరి జగన్నాథ్ త‌న‌ సినిమాల్లో రక్షితకు ఎక్కువ‌ అవకాశాలు ఇచ్చినా ఆమె తెలుగులో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. రక్షిత అసలు పేరు శ్వేత. ఆమె సినిమాల్లోకి అడుగు పెట్టాక తన పేరును రక్షిత‌గా మార్చుకున్నారు . హీరోయిన్‌గా మంచి అవకాశాలు ఉన్న సమయంలోనే 2007 లో కన్నడ దర్శకుడు ప్రేమను లవ్ మ్యారేజ్ చేసుకొని సినిమాలకు దూరమై పోయింది. ఆ తర్వాత రక్షిత కన్నడ టీవీ షోలలో జడ్జి అవతారం ఎత్తింది. నిర్మాతగా కూడా మరి కొన్ని సినిమాలు తీసింది.

అయితే ఇప్పుడు ర‌క్షిత‌ను చూస్తే మనం అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. హీరోయిన్ గా ఉన్నప్పుడు మంచి ఫిజిక్ తో పాటు మంచి స్ట్రక్చర్ మెయింటెన్ చేసిన రక్షిత ఇప్పుడు బాగా లావు అయి పోయింది. తనకు కొడుకు పుట్టాక థైరాయిడ్ రావడంతో బరువు పెరిగా అని ర‌క్షితో ఇంట‌ర్వ్యూలో చెప్పారు. ఆమె 2012లో రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news