Moviesఫోన్ చేసి మరీ..ప్రభాస్ కు ఆ హీరోయిన్ అంత నచ్చేసిందా..?

ఫోన్ చేసి మరీ..ప్రభాస్ కు ఆ హీరోయిన్ అంత నచ్చేసిందా..?

పాన్ ఇండియా హీరో ప్రభాస్..వరుస సినిమాలకు కమిట్ అయ్యి..సినిమా సినిమాకి తన రేంజ్ ను పెంచుకుంటూ పోతున్నారు. సినిమా హిట్టా..ఫట్టా అన్న సంగతి పక్కన పెడితే.. ఆయన క్రేజ్ మాత్రం తగ్గడంలేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన రాధే శ్యామ్ సినిమా ఆయనని నిరాశ పరిచినప్పటికి..ప్రభాస్ యాక్టింగ్ కు మాత్రం మంచి రెస్పాన్ సే వచ్చింది. ఇప్పుడు ప్రభాస్ ఆశల్నీ..తన నెక్స్ట్ సినిమా “సలార్” పై నే పెట్టుకుని ఉన్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది.

అయితే, రీసెంట్ గా ప్రభాస్ ఓ హీరోయిన్ పై మనసు పారేసుకుంటున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. KGF 2..సినిమా సృష్టించిన భీబత్సం ఎలాంటిదో మనం చూశాం. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫిస్ లెక్కలను తిరగరాసింది. యాష్ యాక్టింగ్..ప్రశాంత్ డైరెక్షన్..శ్రీనిధి అందాలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. సినిమాలో హీరోయిన్ కి కెవలం గ్లామర్ కోసం వాడుకోకుండా.. కధలో భాగం చేస్తూ.. కింగ్ లాంటి మగాడిని సైతం తన ప్రేమతో కంట్రోల్ లో పెట్టిన అమ్మాయిగా..తన అమ్మను తిరిగివ్వాలని అనుకునే భార్య గా..శ్రీనిధి బాగా యాక్ట్ చేసింది.

సినిమా చూసిన తరువాత బడా స్టార్స్ సైతం ఆమెను మెచ్చుకున్నారు. ఇండస్ట్రీకి నీలాంటి హీరోయిన్ అవసరం అంటూ ఓ రేంజ్ లో పొగిడేశారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో ప్రభాస్ చేరిపోయాడు. KGF 2 లో శ్రీనిధి యాక్టింగ్ ప్రభాస్ కు తెగ నచ్చేసిందట. అంతేనా ..ఈ విషయాని ఆమెకే ఫోన్ చేసి ..నీ యాక్టింగ్ బాగుంది.. నాకు నచ్చింది.. గుడ్ Keep it up అంటూ బాగా మెచ్చుకున్నారట. దీంతో ఉబితబ్బిపోయిన శ్రీనిధి ఈ విషయాని ఫ్రెండ్స్ కు చెప్పుతూ ఫుల్ షుషీ అవుతుందట. ఏది ఏమైన ప్రభాస్ నే ఇంప్రెస్ చేసిందటే పాప భవిష్యత్తు చాలా బాగుంటుందనే అర్ధం అంటున్నారు ప్రముఖులు. మరి చూడాలి శ్రీనిధి కెరీర్ ఎలా ఉంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news