Moviesటైం చూసి కొట్టింది .. కొరటాల పై కాజల్ తల్లి షాకింగ్...

టైం చూసి కొట్టింది .. కొరటాల పై కాజల్ తల్లి షాకింగ్ కామెంట్స్..?

కొరటాల శివ.. నిన్న మొన్నటి వరకు ఈయన అంటే అందరికి ఓ గౌరవం ఉండేది. నిజాయితీ గా ఉంటారని.. అలానే సినిమాలు తీస్తారని..ఎవ్వరిని మోసం చేరని..అస్సలు ఆయన డైరీలో నే ఆ పదనికి చోటు లేదని. కానీ, ఎప్పుడైతే హీరోయిన్ కాజల్ ని ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలో లేదు అని చెప్పారో..ఆప్పటి నుండి అందరి కి ఆయన అంటే విలువ పోయింది. ఇన్నాళ్లు సంపాదించుకున్న పేరు, ప్రతిష్ట ఒక్క మాటతో స్పాయిల్ అయిపోయింది. అంత లా ఆమె ను బాధపెట్టారు కొరటాల అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ ఏప్రిల్ 29న థియేటర్స్ లోకి వస్తుంది. ఈ సినిమా పై ముందు గా పెద్దగా బజ్ లేదు. కానీ, నెమ్మది నెమ్మదిగా కొరటాల సినిమా పై హైప్ క్రియేట్ చేశాడు. చిరు కోసం రాసుకున్న స్టోరీని మారుస్తూ..చరణ్ పాత్రను ఎంట్రీ ఇస్తూ..ఆ తరువాత ఆయన కోసం పూజా ని పిలిపించి..సినిమాకు మంచి టాక్ ను సంపాదించుకున్నాడు. అన్ని బాగానే ఉంది.. మరో కొన్ని రోజుల్లో రిలీజ్ అనగ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు. అక్కడ అంతా బాగానే జరిగిన హీరోయిన్ కాజల్ ఊసే లేదు..అటు హీరో ఇటు డైరెక్టర్ కాజల్ పేరు చెప్పలేదు.

అక్కడ స్టార్ట్ అయ్యింది గొడవ.. దీంతో ఆచార్య లో కాజల్ రోల్ పై పెద్ద ఎత్తునే వార్తలు వైరల్ అయ్యాయి. భరించలేని కొరటాల..కాజల్ ని సినిమా నుండి తీసేశాం అంటూ చెప్పేశాడు. ఆయన రీజన్స్ ఆయన కు ఉన్నాయి. కానీ, కాజల్ ఆచార్య లో లేదు అన్న సంగతి ఈవెంట్ కి ముందు చెప్పినా బాగుండేది.. కానీ కొరటాల అలా చేయలేదు.. ఫైనల్ మూమెంట్ లో..అది జనాల టార్చర్ భరించలేక చెప్పాడు. అంటే కొరటాల కాజల్ పేరుని వాడుకున్నట్లేగా అంటూ ట్రోలర్స్ కొరటాల పై ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ఇక ప్రమోషన్స్ కోసం ఎక్కడికి వెళ్లినా..కాజల్ ప్రశ్నలే ఎదురు అవుతున్నాయి.

దీంతో కొరటాల బెస్ట్ ఫ్రెండ్ కాజల్ కి సన్నిహితుడైన ఓ స్టార్ ప్రోడ్యూసర్ మ్యాటర్ లోకి ఎంట్రీ ఇచ్చి..కాజల్ ని దీని పై రియాక్ట్ అవ్వమని అడిగారట. కాజల్ కూడా టైం చూసి కొరటాల ను దెబ్బెసిన్నట్లు తెలుస్తుంది. “నేను మాట్లాడను” అంటూ ఆ నిర్మాతకి మొహానే చెప్పేసిందట. అంతేకాదు.. ఈ ఇష్యూ పై ఇంకోసారి నాతో మాట్లాకండి అంటూ కోపంగా చెప్పారట కాజల్. ఆమె హ్యాపీ గా బిడ్డ పుట్టి ఎంజాయ్ చేస్తుంటే మధ్యలో ఇలాంటి మ్యాటర్స్ లో తనని బాధపెట్టకండి అంటూ కాజల్ మదర్ కూడా ఆయనకు రిక్వెస్ట్ చేసిన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news