Moviesచిరంజీవికి ఇంతటి అవమానమా..పవన్ భామకి చుక్కలు చూయిస్తున్న మెగా ఫ్యాన్స్..!!

చిరంజీవికి ఇంతటి అవమానమా..పవన్ భామకి చుక్కలు చూయిస్తున్న మెగా ఫ్యాన్స్..!!

ఇండస్ట్రీలో మెగాస్టార్ కి..ఆయన ఫ్యామిలీకి ఉన్న రేంజ్, గౌరవం, మర్యాదా, ఇంపార్టెన్స్..ఎలాంటిదో మనకు తెలిసిందే. ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఆయనే అంటారు అందరు. అలాంటిది ఆ మెగాస్టార్ ని అవమానించింది.. ఓ హీరోయిన్. అది కూడా ఫేడ్ అవుట్ హీరోయిన్. ఇక మెగా ఫ్యాన్స్ ఊరుకుంటారా..? పట్టపగలే చుక్కలు చూయిస్తూ.. అమ్మడికి టార్చర్ అంటే ఏంటో చూయిస్తున్నారు.

పవన్ కల్యాణ్ హీరో గా నటించి..అట్టర్ ఫ్లాప్ అయిన చిత్రం కోమరం పుల్లి. ఈ సినిమా గుర్తుందా..గుర్తుపెట్టుకునేంత హిట్ అవ్వలేదు.. కానీ పవన్ యాక్షన్ సీన్స్ బాగా హైలెట్ అయ్యాయి. ఈ సినిమా లో అక్కడక్కడ మెరుస్తూ.. రెండు మూడూ పాటలో మనల్ని మైమరపించిన భామ నికీషా పటేల్. చేసింది కొన్ని సినిమాలే..హిట్ అయిన సినిమాలు లేనే లేవు.. పెద్దగా చెప్పుకొతగ్గిన హీరోయిన్ కూడా కాదు.. కానీ అమ్మడు అంటే పవన్ అభిమానులు గౌరవం ఇస్తారు. పవన్ సినిమాలో నటించిన హీరోయిన్ గా ఆ మర్యాదా ఉంది.

అయితే రీసెంట్ గా అభిమానులతో చిట్ చాట్ చేసిన ఈ భామ..వాళ్ళు అడిగే ప్రశ్నలకు జవాబు ఇస్తూ..వచ్చింది. మహేష్ బాబు గురించి అడగ్గానే.. హ్యాండ్ సమ్ అని..పవన్ గురించి అదగన్నే.. బియర్డ్ లుక్ అదిరిపోయిందని ఆసక్తికరంగా చెప్పుకొచ్చింది. అంతవరకు బాగానే వెళ్లింది. కానీ అప్పుడే ఓ నెటిజన్..మెగాస్టార్ గురించి చెప్పండి అని అడిగాడు. దీంతో నికీషా..ఏ మెగాస్టార్.. చాలా మంది మెగాస్టార్ లు ఉన్నారు గా అంటూ వెటకారంగానే ఆన్సర్ ఇచ్చింది.ఆ సమాధానం విని మెగా ఫ్యాన్స్ కు మండిపోయింది. నువ్వు మాట్లాడేది తెలుగు ఆడియన్స్ తో..పైగా ముందు నిన్ను అడిగింది కూడా తెలుగు హీరోలనే.. మరి ఏ మెగాస్టార్ అంటావ్ ఏంటి..ఇండస్ట్రీకి ఒక్కడే మెగాస్టార్. అది మా అన్న చిరంజీవి అంటూ మెగా ఫ్యాన్స్ నికీషా ను నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. పాపం అమ్మడికి పట్టపగలే చుక్కలు చూయిస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news