Moviesసీనియ‌ర్ ఎన్టీఆర్ కంటే జూనియ‌ర్ ఎన్టీఆర్ బెట‌ర్ యాక్ట‌ర్ అన్న డైరెక్ట‌ర్‌..!

సీనియ‌ర్ ఎన్టీఆర్ కంటే జూనియ‌ర్ ఎన్టీఆర్ బెట‌ర్ యాక్ట‌ర్ అన్న డైరెక్ట‌ర్‌..!

టాలీవుడ్‌లో సీనియ‌ర్ ఎన్టీఆర్ ఎంత గొప్ప న‌టుడో తెలిసిందే. ఎప్పుడో 1950వ ద‌శ‌కంలో ఎన్టీఆర్ నాటిన ఈ నంద‌మూరి వృక్షంలో ఇప్పుడు మూడో త‌రంలో కూడా ఆయ‌న మ‌న‌వ‌డు జూనియ‌ర్ ఎన్టీఆర్ నంద‌మూరి లెగ‌సీని గ్రాండ్‌గా కంటిన్యూ చేస్తూ తిరుగులేని స్టార్ హీరోగా కొన‌సాగుతున్నాడు. నంద‌మూరి వంశంలో సీనియ‌ర్ ఎన్టీఆర్ త‌ర్వాత రెండో త‌రంలో ఆయ‌న త‌న‌యులు బాల‌కృష్ణ‌, హ‌రికృష్ణ ఇద్ద‌రూ హీరోలుగా కొన‌సాగారు. బాల‌య్య త‌న తండ్రి వార‌స‌త్వాన్ని కంటిన్యూ చేస్తూ స్టార్ హీరోగా ఉన్నాడు. ఇక మూడో త‌రంలో ఎన్టీఆర్ మ‌న‌వ‌ళ్లు జూనియ‌ర్ ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్‌రామ్‌, తార‌క‌ర‌త్న, చైత‌న్య‌కృష్ణ ఇలా ఎంత‌మంది వ‌చ్చినా కూడా ఎన్టీఆర్ మాత్ర‌మే తిరుగులేని క్రేజీ హీరోగా ఉన్నాడు.

విచిత్రం ఏంటంటే త‌న తాత ఎన్టీఆర్ ఎన్ని పాత్ర‌ల్లో న‌టిస్తే.. జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా తాత‌లాగానే పౌరాణికం, సాంఘీకం, చారిత్ర‌కం ఇలా ఏ పాత్ర‌లో అయినా ఇట్టే ఒదిగిపోయాడు. ఈ త‌రం జ‌న‌రేష‌న్లో పౌరాణికం, సాంఘీకం ఇలా ఏ పాత్ర అయినా చేయ‌గ‌ల ఒకే హీరో ఎన్టీఆర్ మాత్ర‌మే. అయితే టాలీవుడ్‌లో ఓ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ మాత్రం సీనియ‌ర్ ఎన్టీఆర్ కంటే జూనియ‌ర్ ఎన్టీఆరే గొప్ప న‌టుడు అని ఓ ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు గీతాకృష్ణ‌. అప్ప‌ట్లో న‌రేష్‌తో కోకిల‌, నాగార్జున‌తో సంకీర్త‌న‌, కీచురాళ్లు.. చాలా యేళ్ల త‌ర్వాత కాఫీబార్ లాంటి సినిమాల‌ను డైరెక్ట్ చేసిన గీతాకృష్ణ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ జూనియ‌ర్ ఎన్టీఆర్‌పై ఈ వ్యాఖ్య‌లు చేశారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ సీనియ‌ర్ ఎన్టీఆర్ కంటే బాగా డ్యాన్స్ చేస్తార‌ని.. ఆయ‌న స‌క‌ళ‌క‌ళా వ‌ల్ల‌భుడు అని చెప్పారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ ఎక్కువుగా మాట్లాడార‌ని.. అయితే తాను అంత ఎక్కువ మాట్లాడ‌వ‌ద్ద‌ని చెప్ప‌డంతో దానిని ఆయ‌న క‌రెక్ట్ చేసుకున్నార‌ని గీతాకృష్ణ చెప్పారు.

ఇక మెగా ఫ్యామిలీ అనే ముద్ర నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు అల్లు ఫ్యామిలీ స‌ప‌రేట్ ఇమేజ్ కోసం ముందుకు వెళుతుందా ? అన్న ప్ర‌శ్న‌కు ఆయ‌న బ‌దులు ఇస్తూ ఆ విష‌యం నాకు తెలియ‌దు అని.. వాళ్ల ఇంట్లో భోజ‌నం చేసి వ‌స్తే కాని ఆ విష‌యం తాను చెప్ప‌లేన‌ని ఆ ప్ర‌శ్న‌కు కౌంట‌ర్ ఇచ్చారు. ఇక ఒక‌ప్పుడు నాగార్జున లాంటి స్టార్ హీరోతో వైవిధ్య‌మైన సినిమాలు చేసిన గీతాకృష్ణ ఇప్పుడు ఫేడ‌వుట్ అయిపోయారు. ఇటీవ‌ల యూట్యూబ్ ఛానెల్స్‌కు ఇంట‌ర్వ్యూలు ఇస్తూ ఏదో ఒక కాంట్ర‌వ‌ర్సీతో కాలం గ‌డిపేస్తూ ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news