Moviesచిరంజీవి VS నాగార్జున 11 సార్లు ఫైట్‌... పై చేయి ఎవ‌రిదంటే..!

చిరంజీవి VS నాగార్జున 11 సార్లు ఫైట్‌… పై చేయి ఎవ‌రిదంటే..!

టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి, మ‌న్మ‌థుడు నాగార్జున ఇద్ద‌రూ కూడా సీనియ‌ర్ హీరోలే. వీరు దాదాపుగా నాలుగు ద‌శాబ్దాలుగా త‌మ కెరీర్ కంటిన్యూ చేస్తూ వ‌స్తున్నారు. దివంగ‌త లెజెండ్రీ హీరో అక్కినేని నాగేశ్వ‌ర‌రావు త‌న‌యుడిగా.. ఆయ‌న సినిమా వార‌సుడిగా హీరో అయ్యాడు నాగార్జున‌. అమెరికాలో ఉన్న‌త విద్యాభ్యాసం చేసిన నాగార్జున చాలా త‌క్కువ టైంలోనే హీరోగా పాపుల‌ర్ అయ్యారు.

ఇక మెగాస్టార్ చిరంజీవికి బ‌ల‌మైన ఫ్యామిలీ స‌పోర్ట్ లేక‌పోయినా ఆయ‌న మామ లెజెండ్రీ క‌మెడియ‌న్ అల్లు రామ‌లింగ‌య్య ఉన్నారు. అయితే చిరంజీవి స్వ‌యంకృషితోనే ఎదిగి హీరో అయ్యారు. ఇక దాదాపు ఒకే టైంలో కెరీర్ స్టార్ట్ చేసి.. స్టార్ హీరోలుగా ఎదిగిన ఈ ఇద్ద‌రు హీరోలు త‌మ సినిమాల‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దాదాపు 11 సార్లు పోటీప‌డ్డారు. మ‌రి ఈ 11 సార్ల పోరాటంలో ఎవ‌రు ఎప్పుడు పై చేయి సాధించారో ? చూద్దాం.

1) 1986లో:
చిరు- వేట- (ఫ్లాప్ )
నాగ్ – విక్ర‌మ్ -( హిట్ )
ఈ తొలి పోరాటంలో నాగార్జున విక్ర‌మ్ సినిమా పైచేయి సాధించింది.

2) 1986 లోనే :
చిరు- చంట‌బ్బాయి ( యావ‌రేజ్ )
నాగ్ – కెప్టెన్ నాగార్జున (ఫ్లాప్ )
1986లోనే వీరు రెండోసారి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోరాటం చేశారు. ఈ పోరాటంలో ఇద్ద‌రి సినిమాలు కూడా ప్రేక్ష‌కుల అంచ‌నాలు అందుకోలేదు.

3 ) 1987 లో
నాగ్ -అర‌ణ్య‌కాండ ( ఫ్లాప్ )
చిరు-దొంగ‌మొగుడు (సూప‌ర్ హిట్)
నాగ్ -మ‌జ్ను ( సూప‌ర్ హిట్ )
1987లో దాస‌రి నారాయ‌ణ రావు ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున హీరోగా వ‌చ్చిన మ‌జ్ను సినిమా నాగ్‌ను తండ్రి ఏన్నార్‌ను గుర్తు చేస్తూ అభిన‌వ దేవ‌దాసును చేసింది.

4) 1987లో:
నాగ్ – సంకీర్త‌న ( ( ఫ్లాప్ )
చిరు-ఆరాధ‌న ( ఫ్లాప్ )
1987లోనే వీరు రెండోసారి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోరాటం చేయ‌గా.. ఇద్ద‌రి సినిమాలు సంకీర్త‌న‌, ఆరాధ‌న రెండూ ప్లాప్ అయ్యాయి.

5) 1988 లో:
చిరు- రుద్ర‌వీణ ( ఫ్లాప్ )
నాగ్ – ఆఖ‌రి పోరాటం (సూప‌ర్ హిట్ )
1988లో ఆఖ‌రి పోరాటం హిట్ అయ్యింది. అయితే రుద్ర‌వీణ క‌మ‌ర్షియ‌ల్‌గా ప్లాప్ అయినా మంచి పేరు తెచ్చుకుంది.

6) 1988లో:
నాగ్ – ముర‌ళీ కృష్ణుడు ( ఫ్లాప్ )
చిరు- ఖైదీ నెంబ‌ర్ 786 (సూప‌ర్ హిట్ )
1988లో ఖైదీ నెంబ‌ర్ 786 హిట్ అవ్వ‌గా నాగార్జున ముర‌ళీ కృష్ణుడు ప్లాప్ అయ్యింది.

7) 1989లో:
చిరు- అత్త‌కు య‌ముడు అమ్మాయికి మొగుడు (ఇండ‌స్ట్రీ హిట్ )
నాగ్ – విజ‌య్ (ఫ్లాప్)
1989లో మాత్రం చిరుదే పైచేయి అయ్యింది. అత్త‌కుయ‌ముడు.. అమ్మాయికి మొగుడు సూప‌ర్ హిట్‌.

8) 1990 లో:
చిరు- కొండ‌వీటి దొంగ ( సూప‌ర్ హిట్ )
నాగ్ – ప్రేమ యుద్దం (ఫ్లాప్ )
1990లో చిరు కొండ‌వీటి దొంగ ఇప్ప‌ట‌కీ క్లాసిక్ మూవీ. అస‌లు ప్రేమ యుద్ధం టైటిలే చాలా మందికి గుర్తు లేదు.

9) 1994:
చిరు- ము‌గ్గురు మొన‌గాళ్లు ( యావ‌రేజ్ )
నాగ్ – గోవిందా గోవిందా (ఫ్లాప్ )
1994లో చిరు ముగ్గురు మొన‌గాళ్లు యావ‌రేజ్ ఫిలిం అయితే గోవిందా గోవిందా డిజాస్ట‌ర్ అయ్యింది.

10) 2006 లో:
చిరు- స్టాలిన్ ( యావ‌రేజ్ )
నాగ్ – బాస్ ( ఫ్లాప్ )
2006లో చివ‌రి సారిగా వీరు స్టాలిన్‌, బాస్ సినిమాల‌తో ఒకే టైంలో పోటీ పడ్డారు. స్టాలిన్ యావ‌రేజ్ అయితే.. బాస్ ప్లాప్ అయ్యింది. ఓవ‌రాల్‌గా చూస్తే నాగ్ కంటే ఈ పోటీలో చిరుదే పై చేయి అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news