Moviesఅబ్బా ఇద్ద‌రు ముద్దు గుమ్మ‌ల‌తో మెగాస్టార్... రొమాన్స్ కుమ్ముడే కుమ్ముడు..!

అబ్బా ఇద్ద‌రు ముద్దు గుమ్మ‌ల‌తో మెగాస్టార్… రొమాన్స్ కుమ్ముడే కుమ్ముడు..!

మెగాస్టార్ చిరంజీవి వ‌రుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. సైరా త‌ర్వాత చిరు చాలా ప్రాజెక్టుల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇస్తున్నారు. కొర‌టాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆచార్య వ‌చ్చే నెల 29న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో చిరుకు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించ‌గా… చ‌ర‌ణ్‌కు జోడీగా పూజా హెగ్డే న‌టించింది. ఇక ఆచార్య త‌ర్వాత చిరు న‌టిస్తోన్న సినిమాలు చూస్తే మోహ‌ర్ ర‌మేష్ డైరెక్ట్ చేస్తోన్న భోళా శంక‌ర్‌లో మిల్కిబ్యూటీ త‌మ‌న్నా హీరోయిన్‌గా చేస్తోంది. మిల్కీబ్యూటీ – మెగాస్టార్ కాంబినేష‌న్ ఇప్ప‌టికే సైరాలో ఉంది. ఇప్పుడు మ‌రోసారి వీరు జోడీ క‌డుతున్నారు. మ‌రో క్రేజీ హీరోయిన్ కీర్తి సురేష్ ఈ సినిమాలో చిరుకు చెల్లి పాత్ర‌లో క‌నిపిస్తోంది.

ఇక మోహ‌న‌రాజా ద‌ర్శ‌క‌త్వంలో మ‌ళ‌యాళ రీమేక్ లూసీఫ‌ర్‌కు అనువాదంగా తెలుగులో వ‌స్తోన్న గాడ్‌ఫాద‌ర్ సినిమాలో న‌య‌న‌తార న‌టిస్తోంది. న‌య‌న‌తార కూడా చిరు ప‌క్క‌న సైరా సినిమా చేసింది. ఈ రెండు సినిమాల‌తో పాటు యంగ్ డైరెక్టర్ కె.ఎస్‌. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో చిరు అదిరిపోయే ప‌వ‌ర్ ఫుల్ మాస్ ఎంట‌ర్టైన‌ర్‌లో న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో చిరుతో పాటు మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ కూడా కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తున్నాడు.

వాల్తేరు వీర‌య్య అన్న టైటిల్‌ను ఈ సినిమాకు ప‌రిశీలిస్తున్నారు. చిరు 154వ ప్రాజెక్టుగా ఇది తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో న‌టించేందుకు ర‌వితేజ రు. 10 కోట్ల రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేశాడ‌ట‌. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతీహాస‌న్ ఎంపికైంది. వుమెన్స్ డే సంద‌ర్భంగా శృతి చిరును క‌ల‌వ‌గా.. ఆమె బొకేతో స్వాగ‌తం ప‌లుకుతున్న ఫొటో సైతం చిరు త‌న ట్వీట్ట‌ర్‌లో షేర్ చేశారు. ఇక ఈ సినిమాలో చిరు ప‌క్క‌న శృతీతో పాటు మ‌రో హీరోయిన్ కూడా న‌టిస్తోంద‌ట‌. ఆమె ఎవ‌రో కాదు మాళ‌విక మోహ‌న‌న్‌.

చిరు – శృతీ జోడీయే అదిరిపోతుంది అనుకుంటే.. ఇప్పుడు చిరు ప‌క్క‌న మాళ‌విక మోహ‌న కూడా ఎంట్రీ ఇస్తే రొమాన్స్ మామూలుగా ఉండ‌దు. ఇద్ద‌రు చిరు ప‌క్క‌న తొలిసారి జోడీ క‌డుతోన్న వారే.. శృతీ కాస్త ముదురు ముద్దుగుమ్మే.. ఇంకా చెప్పాలంటే తెలుగులో ఫేడ‌వుట్ అయ్యి.. ఇప్పుడు సీనియ‌ర్ హీరోల‌కు బెస్ట్ ఆప్ష‌న్‌గా మారింది. ఇక చిరు ప‌క్క‌న కుర్ర ముద్దుగుమ్మ మాళ‌విక రొమాన్స్ ఏ రేంజ్‌లో ఉంటుందో ? బాబి ఈ మాస్ మ‌సాలా ఎలా మిక్స్ చేస్తాడో ? చూడాలి.

ఇక ఇప్ప‌టికే ఈ సినిమా మెయిన్ ప్లాట్‌ను ద‌ర్శ‌కుడు బాబి చిరుకు వినిపించేశాడు. చిరు చిన్న చిన్న మార్పుల‌తో ఓకే చేసేశాడు. త్వ‌ర‌లోనే పూర్తి క‌థ‌ను చిరుకు వినిపించి. ఓకే చేసుకున్న వెంట‌నే సెట్స్ మీద‌కు తీసుకు వెళ్లే ప్లానింగ్ న‌డుస్తోంది. వ‌చ్చే యేడాది ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news