Moviesబిగ్ షాక్‌.. టాలీవుడ్‌లో ఒకేసారి మూడు యువ జంట‌ల విడాకులు..!

బిగ్ షాక్‌.. టాలీవుడ్‌లో ఒకేసారి మూడు యువ జంట‌ల విడాకులు..!

ఈ త‌రం జ‌న‌రేష‌న్ ఆలోచ‌న‌లు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఏ విష‌యంలోనూ ఎవ్వ‌రూ రాజీప‌డ‌డం లేదు. ఏ మాత్రం స‌ర్దుకుపోవ‌డం లేదు. చిన్న చిన్న విష‌యాల‌కు కూడా పంతాల‌కు, ప‌ట్టింపుల‌కు పోతున్నారు. అందుకే పెళ్లికి ముందు ఎంతో ఘాటుగా ప్రేమించుకుని.. ఒకిరిని విడిచి. మ‌రొక‌రు ఉండ‌లేని జంట‌లు కూడా పెళ్ల‌య్యాక ఆ బంధంలో రెండు, మూడేళ్ల‌కు మించి ఉండ‌లేక‌పోతున్నారు. మ‌రి కొంద‌రు ఆరు నెల‌ల‌కే విడాకులు తీసుకుంటున్నారు.

ముఖ్యంగా సినీ సెల‌బ్రిటీల్లో ఈ విడాకుల తంతు కామ‌న్ అయిపోయింది. గ‌త ఆరేడు నెల‌లుగా చూస్తే ఆమీర్‌ఖాన్ – కిర‌ణ్‌రావు, నాగ‌చైత‌న్య – స‌మంత‌, ధ‌నుష్ – ఐశ్వ‌ర్య ఇలా చాలా మంది పాపుల‌ర్ జంట‌లు కూడా చాలా సింపుల్‌గా విడిపోతున్నారు. పైగా వీళ్ల‌లో 15 ఏళ్లు కాపురాలు చేసిన వారు కూడా ఉన్నారు. ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య విష‌యానికే వ‌స్తే 18 ఏళ్లు కాపురం చేశాక‌.. వీరు ఏ కార‌ణంతో విడిపోయారు.. ? అస‌లు అంత పెద్ద గొడ‌వే నిజంగా జ‌రిగి ఉంటే.. అలాంటి గొడ‌వ‌లు 18 ఏళ్ల‌లో ఎన్నోసార్లు జ‌రిగి ఉండేవి. అయినా వాళ్లు ఈ వ‌య‌స్సులో విడిపోయారు.

రెండు పెళ్లిళ్లు చేసుకున్న అమీర్‌, కిర‌ణ్‌రావుకు ఎందుకు విడాకులు ఇచ్చాడో.. ఈ వ‌య‌స్సులో మ‌రో యువ‌తికి ద‌గ్గ‌రై ఏం సాధించాల‌నుకుంటున్నాడో ? అర్థం కాని ప్ర‌శ్న. ఇక టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు.. ఏకంగా మూడు జంట‌లు విడాకులకు రెడీ అవుతున్నారు. దాదాపు ఈ మూడు జంట‌లు విడిపోవ‌డం ఖాయ‌మైన‌ట్టే..! వీరిలో ఇద్ద‌రు యంగ్ హీరోలు, మ‌రొక‌రు యంగ్ డైరెక్ట‌ర్ ఉన్నారు. ఈ వార్త‌లు ఇప్పుడు ఇండ‌స్ట్రీలో పెద్ద క‌ల‌క‌ల‌మే రేపుతున్నాయి.

ఓ యంగ్ హీరో క‌రోనా టైంలో రెండేళ్ల క్రిత‌మే పెళ్లి చేసుకున్నాడు. ఒక‌ప్పుడు వ‌రుస హిట్ల‌తో యంగ్ హీరోల్లో మంచి పేరు తెచ్చుకున్న స‌ద‌రు హీరో గ‌త యేడాది కాలంగా కెరీర్‌పై కూడా స‌రిగా కాన్‌సంట్రేష‌న్ చేయ‌డం లేదు. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం త‌న భార్య‌తో వ‌చ్చిన విబేధాల వ‌ల్లే అంటున్నారు. క‌రోనా టైంలోనే పెళ్లి జ‌రిగినా యేడాది నుంచే వీరి మ‌ధ్య గ్యాప్ స్టార్ట్ అయ్యింద‌ట‌. ఆరు నెల‌లుగా వేర్వేరుగా ఉంటోన్న ఆ జంట‌ను క‌లిపేందుకు పెద్ద‌లు చేసిన ప్ర‌య‌త్నాలు ఫెయిల్ కావ‌డంతో ఇప్పుడు విడాకుల‌కు రెడీ అవుతున్నారు.

ఇక మ‌రో యంగ్ హిట్ డైరెక్ట‌ర్ సైతం భార్య‌కు కొద్ది నెల‌లుగా దూరంగా ఉంటున్నాడు. మ‌నోడు ఓ క్రేజీ హీరోకు సూప‌ర్ హిట్ సినిమా ఇచ్చాడు. త‌ర్వాత అత‌డే హీరోగా మ‌రో సినిమా కూడా చేశాడు. అయితే త‌న త‌ల్లిని చూసుకునే విష‌యంలో త‌న భార్య‌కు, త‌న‌కు మ‌ధ్య వ‌చ్చిన విబేధాలే ఈ విడాకుల‌కు కార‌ణమ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్ ? ఇక చిన్నా చిత‌కా సినిమాల్లో హీరోగా న‌టించిన మ‌రో హీరో సైతం ఇప్పుడు విడాకుల‌కు రెడీ అయిపోయిన‌ట్టు తెలుస్తోంది. వీరి మ‌ధ్య కూడా స‌ర్దుబాటు కుదిరే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో వీరు విడిపోతున్నార‌ట‌. ఏదేమైనా ఎక్కువ మంది ఇలా విడాకులు తీసుకోవ‌డం ఇప్పుడు ఇండ‌స్ట్రీని క‌ల‌వ‌ర‌పెడుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news