Moviesమెగాస్టార్ చిరంజీవి గ్యాంగ్‌లీడ‌ర్ సినిమాలో ముందుగా అనుకున్న హీరో ఎవ‌రో తెలుసా..!

మెగాస్టార్ చిరంజీవి గ్యాంగ్‌లీడ‌ర్ సినిమాలో ముందుగా అనుకున్న హీరో ఎవ‌రో తెలుసా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్ట‌ర్ సినిమాలు వ‌చ్చాయి. ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల్లో 1991లో వ‌చ్చిన మాసీవ్ హిట్ గ్యాంగ్‌లీడ‌ర్ ఒక‌టి. ఈ సినిమా అప్ప‌ట్లో సాధించిన విజ‌యం పెద్ద సంచ‌ల‌నం. చిరంజీవిని మాస్ జ‌నాలకు మ‌రింత ద‌గ్గ‌ర చేసిందీ సినిమా. శ్యాం ప్ర‌సాద్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌కు మెగాస్టార్ చిరంజీవికి ఎంతో అనుబంధం ఉంది. వీరి కాంబినేష‌న్లో వ‌చ్చిన సినిమాలు అన్నీ హిట్. అయితే గ్యాంగ్‌లీడ‌ర్ సినిమా త‌ర్వాత చివ‌రిగా వ‌చ్చిన బిగ్‌బాస్ సినిమా మాత్ర‌మే ప్లాప్ అయ్యింది. శ్యాం ప్ర‌సాద్ ఆర్ట్స్ – చిరంజీవి – విజ‌య బాపినీడు వీళ్ల కాంబినేష‌న్‌కు మంచి క్రేజ్ ఉండేది.

ఇక గ్యాంగ్ లీడ‌ర్ సినిమాకు మాజీ మంత్రి మాగంటి ర‌వీంద్ర‌నాథ్ చౌద‌రి నిర్మాత‌. 1991 మే 9న రిలీజ్ అయిన ఈ సినిమాలో లేడీ అమితాబ‌చ్చ‌న్ విజ‌య‌శాంతి హీరోయిన్‌గా న‌టించారు. బ‌ప్పీల హ‌రి మ్యూజిక్ కంపోజింగ్‌లో వ‌చ్చిన పాట‌లు అఖిలాంధ్ర ప్రేక్ష‌కుల‌ను ఊపేశాయి. అయితే ఈ సినిమా వెన‌క చాలా ఇంట్ర‌స్టింగ్ విష‌యాలే ఉన్నాయి. అస‌లు ఈ సినిమా క‌థ‌ను ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ ముందుగా చిరంజీవి కోసం రాసుకోలేదు.

సినిమాల్లో నిల‌దొక్కుకునేందుకు ఇబ్బందులు ప‌డుతోన్న మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కోసం ఓ ప‌వ‌ర్ ఫుల్ క‌థ‌ను రాయ‌మ‌ని చిరంజీవే స్వ‌యంగా ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌ను అడిగార‌ట‌. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ క‌థ రెడీ చేసి షోలే సినిమాలో హిట్ అయిన ఆరే ఓ సాంబ టైటిల్ పెట్టి ద‌ర్శ‌కుడు విజ‌య బాపినీడు ద‌గ్గ‌ర‌కు తీసుకు వెళ్లార‌ట‌. ఈ క‌థ‌.. టైటిల్ చూసిన బాపినీడు.. ఇంత మాస్ క‌థ నాగ‌బాబుకు సెట్ కాద‌ని.. చిర‌కు బాగా సెట్ అవుతుంద‌ని.. క‌థ‌లో కొన్ని మార్పులు చేసి చిరంజీవికి చెప్పారు. చివ‌ర‌కు గ్యాంగ్‌లీడ‌ర్ టైటిల్ పెట్టి చిరంజీవితో సినిమా తీస్తే సూప‌ర్ హిట్ అయ్యింది.

ఈ సినిమాలో చెయ్యి చూశావా ఎంత ర‌ఫ్‌గా ఉందో ర‌ఫ్ ఆడించేస్తా అనే డైలాగ్ బాగా పాపుల‌ర్ అయ్యింది. ఈ సినిమా 100 రోజుల వేడుక చిరంజీవి పుట్టిన రోజున ఒకే రోజు నాలుగు ప‌ట్ట‌ణాల్లో జ‌ర‌ప‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌నం అయ్యింది. తిరుపతి, హైదరాబాదు, ఏలూరు, విజయవాడలలో ఒకేరోజు ఈ శతదినోత్సవం జ‌రిగింది. ఈ సినిమా 100 రోజుల ఫంక్ష‌న్ కోసం చిరంజీవితో పాటు సినిమా యూనిట్ కోసం ప్ర‌త్యేక విమానం వాడారు. త‌ర్వాత ఈ సినిమాను హిందీలో అజ్‌కా గూండారాజ్ పేరుతో రీమేక్ చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news