Moviesహ‌రికృష్ణ హిట్ సినిమా రీమేక్‌లో ఎన్టీఆర్‌... ఆ ఒక్క కండీష‌న్‌తోనే...!

హ‌రికృష్ణ హిట్ సినిమా రీమేక్‌లో ఎన్టీఆర్‌… ఆ ఒక్క కండీష‌న్‌తోనే…!

త్రిబుల్ ఆర్ ప్ర‌మోష‌న్ల ర‌చ్చ మామూలుగా లేదు. ఈ ప్ర‌మోష‌న్లు సౌత్ టు నార్త్‌.. దుబాయ్ ఇలా రాష్ట్రం దాటేసే కాదు.. దేశం దాటేసి ఎక్క‌డ జ‌రుగుతున్నా కూడా తార‌కే ముందు హైలెట్ అవుతున్నారు. ప్ర‌మోష‌న్ల‌లో తార‌క్ ఎన‌ర్జిటిక్‌కు ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అవుతున్నారు. తాజాగా త్రిబుల్ సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి తార‌క్‌, చ‌ర‌ణ్‌ల‌తో ఓ ప్ర‌మోష‌న‌ల్ వీడియో చేశారు. ఈ సినిమా విశేషాల‌తో పాటు ప‌లు విశేషాల‌పై స‌ర‌దాగా చిన్న చిట్ చాట్‌లా ఇది జ‌రిగింది.

ఈ చిట్ చాట్ సంభాష‌ణ‌ల్లో ఎవ‌రికి వారు ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు. ఎన్ని విష‌యాలు ఉన్నా కూడా తార‌కే ఈ వీడియోలో ఫుల్ డామినేష‌న్ చేశాడు. ఈ క్రమంలోనే కీర‌వాణి మాట్లాడుతూ ఎన్టీఆర్ తండ్రి హ‌రికృష్ణ‌తో త‌న‌కు ఉన్న అనుబంధం గుర్తు చేసుకున్నాడు. సీత‌య్య సినిమా, ఎన్టీఆర్ సింహాద్రి సినిమా ఒకే టైంలో వ‌చ్చాయ‌ని.. రెండు సినిమాల కంపోజింగ్ ఒకేసారి జ‌రిగింద‌ని అన్నారు.

ఓ సారి సింహాద్రి సాంగ్స్ కంపోజింగ్ జ‌రిగిన‌ప్పుడు తాను సీత‌య్య సాంగ్ కంపోజ్ చేసి వ‌చ్చాన‌ని… అప్పుడు రాజ‌మౌళి ఒక్క మ‌గాడు సాంగ్ గురించి తెలుసుకుని ప‌దే ప‌దే సాంగ్‌నే హ‌మ్ చేస్తూ ఉండేవాడ‌ని కూడా కీర‌వాణి తెలిపారు. ఇక సీత‌య్య సినిమా అంటే త‌న‌కు చాలా ఇష్టం అని.. ఆ సినిమాను నువ్వు రీమేక్ చేయాల‌ని కీర‌వాణి తార‌క్‌తో అన్నారు.

నువ్వు ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా చేయాల‌ని కూడా కీర‌వాణి ఆకాంక్షించారు. చ‌ర‌ణ్ కూడా మోడ్ర‌న్ సీత‌య్యగా చేస్తే బాగుంటుంద‌ని స‌ల‌హా ఇచ్చాడు. అయితే అందుకు ఎన్టీఆర్ కూడా ఆ సినిమా అంటే త‌న‌కూ ఇష్టం అని చెపుతూనే ఓ కండీష‌న్ కూడా పెట్టారు. తాను సీత‌య్య సినిమా రీమేక్ చేయాలంటే అందుకు కీర‌వాణి గారే ఒక్క‌మ‌గాడు సాంగ్ రీమిక్స్ చేయాల‌ని.. సీత‌య్య సినిమాకు ఆర్ ఆర్ కూడా ఇవ్వాల‌ని అన్నారు.

 

ఇక ఇటీవ‌ల కాలంలో బాగా న‌చ్చిన సింగ‌ర్ ఎవ‌ర‌న్న ప్ర‌శ్న‌కు తారక్ అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ సినిమాలోని ఊరికి ఉత్త‌రాన‌.. రెడ్డ‌మ్మ త‌ల్లి పాట చాలా ఇష్టం అని చెపుతూనే.. ఆ పాట పాడిన మోహ‌నా భోగ‌రాజ్ గారి వాయిస్ త‌న‌కు చాలా బాగా న‌చ్చింద‌ని చెప్పాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news