Newsవ‌రుణ్‌తేజ్‌తో లావ‌ణ్య పెళ్లికి చిరు గ్రీన్‌సిగ్న‌ల్‌... నాగ‌బాబు టెన్ష‌న్ ఏంటి...!

వ‌రుణ్‌తేజ్‌తో లావ‌ణ్య పెళ్లికి చిరు గ్రీన్‌సిగ్న‌ల్‌… నాగ‌బాబు టెన్ష‌న్ ఏంటి…!

టాలీవుడ్‌లో ఇప్పుడు మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్స్ లిస్టు తీస్తే అందులో మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ పేరు కూడా ముందు వ‌రుస‌లోనే ఉంటుంది. నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్‌తేజ్ త‌క్కువ టైంలోనే టైర్ 2 హీరోల్లో స్టార్ హీరో అయిపోయాడు. ఇప్పుడు ఒక్కో సినిమాకు వ‌రుణ్ రు. 8 – 10 కోట్ల రేంజ్ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడు. అటు సోలో హిట్ల‌తో పాటు ఇటు ఎఫ్ 2 లాంటి మ‌ల్టీస్టార‌ర్ హిట్లు కూడా త‌న ఖాతాలో వేసుకుంటున్నాడు. ఈ క్ర‌మంలోనే వెంకీతో వ‌రుణ్ చేసిన ఎఫ్ 3 సినిమా కూడా త్వ‌ర‌లోనే థియేట‌ర్ల‌లోకి రానుంది.

వ‌రుణ్ ఎంచుకునే క‌థ‌లు, డైరెక్ట‌ర్లే అత‌డి విజ‌యాల‌కు హెల్ఫ్ అవుతున్నారు. వ‌రుణ్ వివాదాల‌కు ఎప్పుడూ దూరంగా ఉంటాడు. ఈ క్ర‌మంలోనే హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠితో మ‌నోడు ప్రేమ‌లో ఉన్నాడ‌ని.. ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాడ‌న్న ప్ర‌చారం కొద్ది రోజుల నుంచి ఉన్న‌దే. కొద్ది రోజుల క్రితం ఆమె పుట్టిన రోజు నాడు బెంగ‌ళూరు వెళ్లి డైమండ్ రింగ్‌తో ప్ర‌పోజ్ చేయ‌బోతున్నాడంటూ ఒక్క‌టే పుకార్లు వ‌చ్చాయి. అయితే ఆ వార్త‌ల‌పై స్పందించిన లావ‌ణ్య తాను ఎక్క‌డో నార్త్‌లో త‌న ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాన‌ని చెప్ప‌డంతో పాటు వ‌రుణ్ ప్ర‌పోజ్ వార్త‌ల‌కు ప‌రోక్షంగా కౌంట‌ర్ ఇచ్చింది.

కౌంట‌ర్ స‌రే నిహారిక పెళ్లిలో లావ‌ణ్య‌దే హ‌డావిడి…


లావ‌ణ్య ప‌రోక్షంగా కౌంట‌ర్లు ఇచ్చినా.. ఈ ప్రేమ‌పై అటు వ‌రుణ్‌, ఇటు లావ‌ణ్య నోరు మెద‌ప‌క‌పోయినా కూడా వ‌రుణ్ చెల్లి నిహారిక పెళ్లికి కేవ‌లం మెగా ఫ్యామిలీకి చెందిన కొద్దిమంది, వారి స‌న్నిహితుల‌కు మాత్ర‌మే ఆహ్వానాలు అందాయి. రాజ‌స్తాన్‌లో జోధ్‌పూర్‌లో జరిగిన ఈ పెళ్లిలో ఇండ‌స్ట్రీ నుంచి త‌ళుక్కున మెరిసిన ఒకే ఒక్క హీరోయిన్ లావ‌ణ్య‌. అంతేకాదు… అక్క‌డ ఇంట్లో మ‌నిషిగా క‌లిసిపోయి… నిహారిక‌ను పెళ్లి కుమార్తెను చేయ‌డం ద‌గ్గ‌ర నుంచి పెళ్లి ప‌నులు అన్నీ ద‌గ్గ‌రుండి మ‌రీ చూసుకుంది.

అంతే కాదు మెగా ఫ్యామిలీ గెట్ టు గెద‌ర్ ఫంక్ష‌న్ల‌లో ఆమె త‌ళుక్కున మెరుస్తూ ఉంటుంది. ఇవే లావ‌ణ్య‌, వ‌రున్ బంధాన్ని మ‌రింత బ‌ల‌ప‌రిచాయి. కొద్ది నెల‌ల క్రితం లావ‌ణ్య త‌న ఇన్‌స్టాలో అభిమానుల‌తో ముచ్చ‌టించిన‌ప్పుడు కూడా కొంద‌రు వ‌రుణ్‌తో పెళ్లి గురించి అడిగారు. ఫ్యాన్స్ అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు ఎంతో ఓపిక‌గా ఆన్స‌ర్లు ఇచ్చిన లావ‌ణ్య వ‌రుణ్ తో పెళ్లి ఎప్పుడు అన్న ప్ర‌శ్న‌కు మాత్రం ఆన్స‌ర్ చేయ‌లేదు.

ప్రేమ ఎక్క‌డ పుట్టింది…
అస‌లు లావ‌ణ్య‌, వ‌రుణ్ ప్రేమ ఎక్క‌డ పుట్టింద‌న్న దానిపై కూడా ఆస‌క్తిక‌ర టాకే ఉంది ఇండ‌స్ట్రీలో.. వీరు ఇద్ద‌రు క‌లిసి మిస్ట‌ర్‌, అంత‌రిక్షం సినిమాలు చేశారు. మిస్ట‌ర్ డిజాస్ట‌ర్‌.. అంత‌రిక్షం కూడా క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ కాదు. వీరి సినిమాలు ఫ‌స్ట్ అయినా వీరి ప్రేమ మాత్రం హిట్ అయ్యింద‌నే అంటారు. లావ‌ణ్య విష‌యం వ‌రుణ్ ఇంట్లో కూడా చెప్పేశాడ‌నే అంటున్నారు. వ‌రుణ్ అమ్మ‌కు కూడా లావ‌ణ్య అంటే ఇష్ట‌మే అని.. అందుకే నిహారిక పెళ్లిలో చాలా ప‌నులు చ‌క్క‌బెట్టే బాధ్య‌త కూడా ఆమెకే ఇచ్చేసింద‌ని అంటున్నారు.

నాగ‌బాబుకు సందేహాలు ఏంటి..


అయితే నాగ‌బాబుకు మాత్రం వ‌రుణ్‌కు ఇండ‌స్ట్రీతో సంబంధం లేని అమ్మాయినే ఇచ్చి పెళ్లి చేయాల‌న్న కోరిక బ‌లంగా ఉండేది. ఇండ‌స్ట్రీ వాళ్లు.. సినిమా హీరో, హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకున్నాక‌.. వారి కాపురాలు ఎలా కుప్ప కూలుతున్నాయో చూస్తూనే ఉన్నాడు. అందుకే నాగ‌బాబుకు మామూలుగా అయితే ఈ పెళ్లి ఇష్టం లేద‌నే అంటున్నారు. అయితే వ‌రుణ్ మ‌న‌స్ఫూర్తిగా ఇష్ట‌ప‌డుతుండ‌డంతో ఆయ‌న మాత్రం చేసేది ఉండ‌దు.. పైగా ఇది చిరంజీవి ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డం ఆయ‌న కూడా వ‌రుణ్‌ను దీవించ‌డం జ‌రిగిపోయాయ‌ని టాక్ ?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news