Moviesవావ్‌... ఆ టాప్‌ డైరెక్ట‌ర్‌తో ఎన్టీఆర్ మ‌ల్టీస్టార‌ర్ సినిమా..!

వావ్‌… ఆ టాప్‌ డైరెక్ట‌ర్‌తో ఎన్టీఆర్ మ‌ల్టీస్టార‌ర్ సినిమా..!

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌ను లైన్‌లో పెట్టుకుంటూ పోతున్నాడు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ న‌టించిన త్రిబుల్ ఆర్ సినిమా కోస‌మే ఏకంగా 3 సంవ‌త్స‌రాల టైం ప‌ట్టేసింది. షూటింగ్ లేట్ అవ్వ‌డం ఒక ఎత్తు అయితే.. క‌రోనా మ‌ధ్య‌లో రెండు సార్లు రావ‌డంతో ఈ సినిమా అనుకున్న టైంకు షూటింగ్ పూర్తి కాలేదు.. రిలీజ్ కాలేదు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌తో పాన్ ఇండియా సినిమా ఉంది. మైత్రీ వాళ్లు భారీ బ‌డ్జెట్‌తో కేజీఎఫ్ రేంజ్‌లో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు.

ఆ త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో ఓ సినిమాను కూడా లైన్లో పెట్టి ఉంచాడు. ఈ రెండు సినిమాల‌తో పాటు ఉప్పెన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సానాతో కూడా ఎన్టీఆర్ సినిమా ఉంది. బుచ్చిబాబు అయితే ఉప్పెన త‌ర్వాత ఎన్టీఆర్ ఎప్పుడు డేట్లు ఇస్తాడా ? అని క‌ర్ఫీఫ్ వేసుకుని.. క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తున్నాడు. బుచ్చిబాబు సినిమా కాకుండానే ఇప్పుడు మ‌రో క్రేజీ డైరెక్ట‌ర్‌తో ఎన్టీఆర్ సినిమా ఉంటుంద‌న్న ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రో కాదు ప‌ర‌శురాం పెట్ల‌. గీత‌గోవిందం ఫేం ప‌ర‌శురాం ప్ర‌స్తుతం సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబుతో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మ‌హేష్‌కు జోడీగా కీర్తి సురేష్ న‌టిస్తోంది. మే 12న బాక్సాఫీస్ బ‌రిలోకి దిగుతోంది. ఈ సినిమా త‌ర్వాత ప‌ర‌శురాం ఎన్టీఆర్ సినిమాపై వ‌ర్క్ స్టార్ట్ చేస్తాడ‌ని అంటున్నారు. గీతా వాళ్లు ప‌ర‌శురాంకు ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చారు. వాళ్ల‌కు ఓ సినిమా చేయాలి.. ఇటు ఎన్టీఆర్‌ను గీతా బ్యాన‌ర్లో సినిమా చేయించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

ఇటీవ‌ల బ‌న్నీకి, ఎన్టీఆర్‌కు మ‌ధ్య రిలేష‌న్ బాగా స్ట్రాంగ్‌గా ఉంది. బ‌హుశా ప‌ర‌శురాం సినిమా ఓకే అయితే. .. అది ఖ‌చ్చితంగా గీతా బ్యాన‌ర్లోనే ఉంటుంది. అయితే ఇది మ‌ల్టీస్టార‌ర్ అని.. ఆ విధంగానే క‌థ‌ను సెట్ చేస్తున్నార‌ని అంటున్నారు. మ‌రి మ‌ల్టీస్టార‌ర్ అయితే ఇందులో మ‌రో హీరో ఎవ‌రు ? అన్న‌ది మాత్రం తెలియ‌డం లేదు. ఇటీవ‌లే ప‌ర‌శురాం ఎన్టీఆర్ అపాయింట్‌మెంట్ తీసుకుని మెయిన్ లైన్ కూడా వినిపించాడంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news