Moviesవావ్: మహేష్ లో ఇంత చేంజ్.. మీరు గమనించారా..?

వావ్: మహేష్ లో ఇంత చేంజ్.. మీరు గమనించారా..?

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి..ఇప్పుడు కృష్ణ ఎవ్వరైయ్యా అంటే మహేష్ బాబు తండ్రి అన్న రేంజ్ లో తన పేరును అందరికి తెలిసేలా చేఉకున్నాడు. ఇక ఈయన ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఆయన ఫ్యాన్స్ ను.. అభిమానులు అని కాదు ఏకంగా భక్తులు అంటుంటారు అందరు.

మహేష్ బాబు ఎంత సైలెంట్ అన్న విషయం మనకు తెలిసిందే. మహేష్ అభిమానులు ఆయన లాగే చాలా సైలెంట్ గా ఉంటారు. మహేష్ బాబు అభిమానులు సాఫ్ట్ అనే బిరుదు కూడా ఉంది. మహేష్ బాబు అంటేనే సాఫ్ట్ మ్యాన్. ఇంకా పక్కాగా చెప్పాలంటే జెంటిల్ మ్యాన్. తను ఎవ్వరికైన సహాయం చేస్తే ఆ విషయాని బయటకు చెప్పుకుని పేపర్లో తన పేరు రాలని అనుకోడు. ఆయన మనస్తత్వం అది. రీసెంట్ గా అన్ స్టాపుబుల్ షోలో కూడా బాలయ్య ఈ విషయానికి మహేష్ బాబుని తెగ మెచ్చుకున్నాడు ..పొగిడేశారు.

ఇక మహేష్ మాస్ సినిమాలు చేసినా క్లాస్ హీరోగా మహేష్ కు తిరుగులేని ఇమేజ్ ఉంటుంది.. అందుకే ఏమో ఇతర హీరోల అభిమానులలు కూడా మహేష్ బాబు కి సపోర్ట్ చేస్తారు. అయితే మహేష్ అందరి కంటికి ఆయన వివాదాలకు పోడు..కాంట్రవ్ర్షీయల్ కామెంట్స్ చేయడు ..తన పని తాను చూసుకుని వెళ్లిపోతాడు అని అనేవారు. కొందరికి అది మంచిగా అనిపించినా మరి కొందరికి అది సేఫ్ ప్లే లా అనిపించేది. కానీ ఇప్పుడు అలాంటి వాళ్ల నోర్లు కూడా మూయించారు మహేష్.

రీసెంట్ గా జగన్ తో జరిగిన టాలీవుడ్ హీరోల సమావేశానికి మహేష్ కూడా హాజరయ్యారు. మహేష్ బాబు ఇండస్ట్రీలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీడియాతో కూడా మాట్లాడారు. నిజానికి ఒకప్పుడు మహేష్ అయితే ఇలాంటి విషయాల్లో తల దూర్ చరు. కానీ మహేష్ మారిపోయాడు. దీంతో సూపర్ స్టార్ మహేష్ బాబులో వచ్చిన ఈ మార్పును చూసి ఆయన అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. మార్పు మంచిదే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిదే. కానీ మనల్ని ముంచడానికి వస్తే మాత్రం మహేష్ తగ్గేదేలే అన్న ఫార్ములాని వాడుతున్నారు అంటూ ఆయన అభిమానులు పొగిడేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news