Moviesఅషురెడ్డిని ఫోన్ నెంబ‌ర్ అడిగిన నెటిజ‌న్‌... అడ్డంగా బుక్ చేసి ప‌డేసిందిగా..!

అషురెడ్డిని ఫోన్ నెంబ‌ర్ అడిగిన నెటిజ‌న్‌… అడ్డంగా బుక్ చేసి ప‌డేసిందిగా..!

అషురెడ్డి యూట్యూబ్‌లో బాగా ఫేమ‌స్ అయిన ఈ అమ్మ‌డు ఎప్పుడు అయితే బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్ప‌టి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల సోష‌ల్ మీడియా అభిమానులు, బుల్లితెర అభిమానుల‌కు మంచి అభిమాన న‌టి అయిపోయింది. బిగ్‌బాస్ హౌస్‌లో కొన్ని వారాల పాటు ఉన్న అషుకు బ‌య‌ట‌కు వ‌చ్చాక మ‌రింత క్రేజ్ పెరిగింది. అభిమానులు జూనియ‌ర్ స‌మంత‌గా ముద్దుగా పిలుచుకునే అషు వైజాగ్ అమ్మాయి.

ఇక హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక కూడా ఆమె హాట్ హాట్ ఇమేజ్‌ల‌తో కుర్ర‌కారులో మ‌రింత ఫాలోయింగ్ పెంచుకుంటోంది. దీనికి తోడు కాంట్ర‌వ‌ర్సీ డైరెక్ట‌ర్ రామ్‌గోపాల్‌వ‌ర్మతో అషురెడ్డి బోల్డ్ ఇంట‌ర్వ్యూ ఆమెకు స్టార్ హీరోయిన్ల‌కు మించిన ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది. అషు తొడ‌ల‌పై వ‌ర్మ చేసిన కామెంట్లు.. ఆ ర‌చ్చ అంతా పీక్స్‌ను మించిపోయింది.

వ‌ర్మ ఇంట‌ర్వ్యూ త‌ర్వాత అషురెడ్డి అంటే తెలియ‌ని వాళ్ల‌కు కూడా బాగా తెలిసిపోయింది. ప్ర‌స్తుతం బుల్లితెరపై పాపుల‌ర్ ప్రోగ్రామ్స్‌తో పాటు కొన్ని షోలు చేస్తోంది. ఇక సోష‌ల్ మీడియాలో ఫోటో షూట్స్‌, ఫ‌న్నీ వీడియోలు పోస్ట్ చేస్తూ త‌న అభిమానుల‌ను ఫుల్ ఖుషీ చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఆమెపై ఎంత కాంట్ర‌వ‌ర్సీ ట్రోలింగ్ జ‌రిగినా కూడా ఆమె పిచ్చ లైట్ తీస్కొంటూ ఉంటుంది.

ఆమె ఒక్కోసారి నెటిజ‌న్ల‌తో, త‌న ఫ్యాన్స్‌తో ముచ్చ‌ట్లు పెట్టుకుంటూ ఉంటుంది. తాజాగా ఓ నెటిజ‌న్ ఆమెను అక్కా నీ ఫోన్ నెంబ‌ర్ ఇవ్వ‌మ‌ని మెసేజ్ పెట్టాడు. త‌న ఫోన్ నెంబ‌ర్ అషుకు పంప‌డంతో పాటు అక్కా నీతో మాట్లాడాల‌ని ఉంద‌ని అడిగాడు. వెంట‌నే అషు అందుకు రిప్లైగా త‌ల ప‌ట్టుకుంటున్న‌ట్టుగా రిప్లే ఇవ్వ‌డంతో పాటు స‌ద‌రు నెటిజ‌న్ ఫోన్ నెంబ‌ర్ కూడా పోస్ట్ చేసింది.

ఇంకేముంది అషురెడ్డి ఫాలోవ‌ర్స్ అంద‌రూ ఆ నెటిజ‌న్‌కు ఫోన్ చేసి ఒక‌టే వాయింపుడ‌ట‌. దీంతో ఆ నెటిజ‌న్ ఆ పోస్ట్ డిలీట్ చేయ్ అక్కా అంటూ అషూకు రిక్వెస్టులు పెట్టుకుంటున్నాడ‌ట‌. దీంతో అషూ ఎంజాయ్ ది స‌ర్వీస్ అంటూ కామెంట్ పెట్టింది. ఇప్పుడు ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news