Moviesరోజాకు ఆ హీరోతో న‌టించాల‌న్న కోరిక ఉంద‌ట‌...!

రోజాకు ఆ హీరోతో న‌టించాల‌న్న కోరిక ఉంద‌ట‌…!

రోజా ఒక‌ప్పుడు టాలీవుడ్ అగ్ర‌హీరోల ప‌క్క‌న వ‌రుస పెట్టి క్రేజీ సినిమాల్లో న‌టించింది. మెగాస్టార్ చిరంజీవి , యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ‌, విక్ట‌రీ వెంక‌టేష్‌, నాగార్జున నుంచి మొద‌లు పెట్టి ప‌లువురు హీరోల ప‌క్క‌న సినిమాలు చేసింది. త‌న అందంతో పాటు అభిన‌యంతో ఆమె ఇండ‌స్ట్రీని ఓ ఊపు ఊపేసింది. ఇండ‌స్ట్రీలో మాంచి ఊపు మీద ఉండ‌గానే… రోజా పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. చంద్ర‌బాబు ఆమెను తెలుగుదేశం రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలిగా ఎంపిక చేశారు. ఆ ప‌ద‌విలో ఉండ‌గానే ఆమె 2004లో న‌గ‌రిలో, 2009లో చంద్ర‌గిరిలో రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడారు.

ఆ త‌ర్వాత వైసీపీలోకి వ‌చ్చి 2014, 2019 ఎన్నిక‌ల్లో న‌గ‌రి నుంచి వ‌రుస‌గా రెండు సార్లు ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. ఓ వైపు ఎమ్మెల్యేగా ఉన్న రోజా, అటు జబ‌ర్ద‌స్త్ ప్రోగ్రామ్ జ‌డ్జ్‌గా ఇలా ఆల్‌రౌండ‌ర్‌గా దూసుకుపోతోంది. అటు రాజ‌కీయాల్లోనూ, ఇటు టీవీ కార్య‌క్ర‌మాల్లోనూ బిజీగా ఉన్న రోజా అస్స‌లు ఇప్పుడు సినిమాల్లో న‌టించ‌డ‌మే మానేశారు. ఇప్ప‌టికే 100కు పైగా సినిమాలలో న‌టించిన రోజా మ‌రోసారి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఆస‌క్తితో ఉన్నారు.

తాజాగా రోజా త‌న‌కు ప్ర‌స్తుతం ఉన్న హీరోల్లో మ‌హేష్‌బాబు అంటే ఎంతో ఇష్టం అన్న విష‌యాన్ని ఓ జ‌బ‌ర్ద‌స్త్ స్కిట్ ద్వారా బ‌య‌ట పెట్టారు. జ‌బ‌ర్ద‌స్త్ హోట్ టూర్‌లో భాగంగా హైప‌ర్ ఆది టీం న‌గ‌రిలోని రోజా నివాసానికి వెళ్లారు. అక్క‌డ హాల్లో వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఫోటో ఉంది. అది చూసిన ఆది ఆయ‌న్ను ఏమి కోరుకుంటున్నార‌ని ప్ర‌శ్నించ‌డంతో కృష్ణ‌గార‌బ్బాయి మ‌హేష్‌బాబుతో సినిమా చేయాల‌ని ఉంద‌ని రోజా ఆ దేవుడిని వేడుకున్నారు.

ఆ త‌ర్వాత రోజా కిచెన్‌లోకి వెళ్లి టీ పెట్టి హైప‌ర్ ఆది టం స‌భ్యుల‌కు ఇచ్చారు. గ‌తంలో ఆది ఒక్క‌డు పేరుతో స్కిట్ చేశాడు. ఇందులో క‌మెడియ‌న్‌గా దొర‌బాబు మ‌హేష్‌బాబుగా, శాంతిస్వ‌రూప్ భూమిక‌గా న‌టించారు. అప్పుడే భూమిక ఆదికి వార్నింగ్ ఇచ్చారు. నువ్వు ఏమైనా మ‌హేష్‌భాబువా… ఫ్యాన్ ఇక్క‌డ‌… చంపేస్తాను.. ఇంకోసారి మ‌హేష్‌బాబు అంటే అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇప్పుడు రోజా మ‌రోసారి త‌న‌కు మ‌హేష్‌బాబుతో క‌లిసి న‌టించాల‌న్న కోరిక‌ను బ‌య‌ట పెట్టుకున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news