Moviesఎన్టీఆర్ ఆ టైంలో ఇంత టెన్ష‌న్ ప‌డ్డాడా... చివ‌ర‌కు ఫ్యామిలీకి కూడా...

ఎన్టీఆర్ ఆ టైంలో ఇంత టెన్ష‌న్ ప‌డ్డాడా… చివ‌ర‌కు ఫ్యామిలీకి కూడా దూరం…!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా మంచి ఫ్యామిలీ మాన్ కూడా..! ఏ మాత్రం టైం దొరికినా ఎన్టీఆర్ వెంట‌నే ఆ స‌మ‌యాన్ని ఫ్యామిలీకి కేటాయిస్తాడు. షూటింగ్ లేక‌పోతే ఇంట్లోనే త‌న భార్య ల‌క్ష్మీ ప్ర‌ణ‌తితో పాటు పిల్ల‌ల‌తో హ్యాపీగా గ‌డుపుతూ ఉంటాడు. ఏ మాత్రం గ్యాప్ వ‌చ్చినా ఫ్యామిలీతో ఉండ‌డ‌మే ఎన్టీఆర్‌కు ఇష్టం. పైగా ఇద్ద‌రు అబ్బాయిలు పుట్టాక ఎన్టీఆర్ మ‌రింత బాధ్య‌త తీసుకుంటున్నాడు.

అలా ఫ్యామిలీతో ఎంతో ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ అయ్యి ఉండే ఎన్టీఆర్ కొద్ది రోజులు ఫ్యామిలీకి దూరం కావాల్సి వ‌చ్చింద‌ట‌. హైద‌రాబాద్‌లోనే ఉన్నా కూడా ఫ్యామిలీకి దూరంగానే ఓ హోట‌ల్లో ఉన్నాడ‌ట‌. అస‌లు విష‌యంలోకి వెళితే ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా కోస‌మే త‌న కెరీర్‌లో ఎంతో విలువ అయిన మూడేళ్లు కేటాయించాడు. ఒక్క సినిమాకు మూడేళ్లు కేటాయించ‌డం అంటే మామూలు విష‌యం కాదు.

ఈ సినిమా ఈ యేడాది మార్చి 25న రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ టైంలోనే క‌రోనా ఒక‌టి కాదు.. రెండు కాదు మూడో సారి కూడా వ‌చ్చింది. అందుకే త్రిబుల్ ఆర్‌ను ఇప్ప‌టికే మూడు సార్లు వాయిదా వేశారు. త్రిబుల్ ఆర్ షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు క‌రోనా ఉధృతంగా ఉంది. సెకండ్ వేవ్‌లో అయితే ఎంతో మంది యువ‌త చ‌నిపోయారు.

ఎన్టీఆర్‌కు ఇంట్లో భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌ల‌తో పాటు వ‌య‌స్సు పైబ‌డిన త‌ల్లి కూడా ఉంది. త‌న వ‌ల్ల వాళ్లు ఇబ్బంది ప‌డ‌డం ఇష్టంలేకే ఎన్టీఆర్ క‌రోనా త‌గ్గే వ‌ర‌కు కూడా హోట‌ల్లోనే గ‌డిపాడ‌ట‌. హోట‌ల్ నుంచే షూటింగ్‌కు వెళ్ల‌డం.. షూటింగ్ అయిపోయాక తిరిగి హోట‌ల్‌కే వెళ్లిపోయేవాడ‌ట‌. ఆ టైంలో తాను మానసికంగా ఇబ్బంది ప‌డ్డాన‌ని ఎన్టీఆర్ చెప్పారు. ఇక త్రిబుల్ ఆర్ పూర్తి చేసిన ఎన్టీఆర్ ప్ర‌స్తుతం కొర‌టాల శివ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news